అక్రమగా కట్టిన టీడీపీ కార్యాలయాన్ని కూల్చేయండి - ఆళ్ళ పిటిషన్

By Surya.K.R Dec. 06, 2019, 04:09 pm IST
అక్రమగా కట్టిన టీడీపీ కార్యాలయాన్ని కూల్చేయండి - ఆళ్ళ పిటిషన్

కృష్ణా నది పరివాహిక ప్రాంతంలో అక్రమకడ్డటాలపై దృష్టి పెట్టిన మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగ వాగు పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మించిన తెలుగుదేశం కార్యాలయాన్ని కూల్చివేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గుంటూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో ఉన్న వాగు పోరంబోకు భూమిలో సర్వేనెంబర్ 392లో 3.65 ఎకరాల భూమిని 2017లో తెలుగుదేశం కార్యాలయం నిర్మాణంకోసం 99ఏళ్ళు లీజుకి ఇస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం జీ.వో జారీ చెసింది. అయితే ఇది చట్ట విరుద్దమని వాగులు , వంకలు, చెరువులు, నదీపరివాహక ప్రాంతాల భూములని కేటాయించటం పర్యావరణ చట్టానికి విరుద్దం అని ఇదే విషయం గతంలో  సుప్రీంకోర్టుకూడా పేర్కొందని ఆ పిటిషన్ లో కోర్టుకు వివరించారు.


ఈ వ్యవహారంలో అనేక చట్ట ఉల్లంఘనలు జరిగిన కారణంగా తన పిటిషన్లో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సి.సి.ఏల్.ఏ కార్యదర్శి, ఏపి సి.ఆర్.డి.ఏ కమీషన్, జిల్లా కలెక్టర్, తెలుగుదేశం అధ్యక్షులని ప్రతివాదులుగా చేర్చి ప్రభుత్వం జారీ చేసిన జీ.వోని రద్దు చేయడంతో పాటు అక్రమంగా కట్టిన భవనాన్ని కూల్చి ఆ భూమిని స్వాధీన పర్చుకోవాలని పిటిషన్ లో కోరారు. ఈ వ్యాజ్యం సొమవారం విచారణకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఆత్మకూరు పరిధిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ దంపతులు టీడీపీ నేతలు, కార్యకర్తలు పూజా కార్యక్రమాలు చేపట్టి తెలుగుదేశం జెండా ఎగురవేసి పాల్గొన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp