ఆద‌ర్శం నుంచి రౌడీయిజం మ‌న హీరోల క‌థ‌

By G.R Maharshi Dec. 09, 2019, 09:32 pm IST
ఆద‌ర్శం నుంచి రౌడీయిజం మ‌న హీరోల క‌థ‌

స‌మాజం సినిమాని ప్ర‌భావితం చేస్తుందా? సినిమానే స‌మాజాన్ని ప్ర‌భావితం చేస్తుందా అంటే చెప్ప‌డం క‌ష్టం. సినిమాల్లో చూసేది స‌మాజంలో క‌నిపిస్తుంది. స‌మాజంలో చూసేదే సినిమాల్లో ఉంటుంది.

ఒక‌ప్పుడు మ‌న సినిమాలు ఆద‌ర్శ‌వాదంతో ప్రారంభ‌మ‌య్యాయి. హీరో ఒక ఆద‌ర్శ‌వాది. సంఘ దురాచారాల‌ని ఎదురిస్తాడు. అవినీతిని ప్ర‌శ్నిస్తాడు. 1940-50 మ‌ధ్య‌లో వ‌చ్చిన సినిమాల్లో హీరోది ఇదే పోక‌డ‌. స్వాతంత్ర పోరాటానికి, స్వాతంత్ర సాధ‌న‌కి మ‌ధ్య‌న ఉన్న ఈ ద‌శాబ్దంలో క‌థా నాయ‌కుడు గాంధేయ‌వాది.

1939లో వ‌చ్చిన వందేమాతరం (ద‌ర్శ‌కుడు బీఎన్ రెడ్డి) కూడా వ‌ర‌క‌ట్న స‌మ‌స్య‌, నిరుద్యోగుల ఇక్క‌ట్ల‌ను చిత్రించింది. 1950-60 మ‌ధ్య‌లో దేశంలో ఒక‌వైపు అభివృద్ధి, మ‌రోవైపు రాజ‌కీయ నాయ‌కుల అవినీతి. నెహ్రూపై జ‌నం ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ జ‌నాన్ని మోసం చేసే నాయ‌కులు అడ్డుప‌డుతున్నారు.

1954లో వ‌చ్చిన వాహిని వారి పెద్ద‌మ‌నుషులులో ప్ర‌ధానంగా అవినీతిపైనే చ‌ర్చ జ‌రిగింది. కేవీ రెడ్డి డైరెక్ష‌న్ , న‌ర్స‌రాజు మాట‌లు రాసిన ఈ సినిమాలో బోలెడ‌న్ని పంచులు, సెటైర్లు ఉంటాయి. కాంట్రాక్ట‌ర్లు, మున్సిప‌ల్ చైర్మ‌న్లు ఎలా త‌ప్పుదోవ ప‌ట్టారో చూడొచ్చు. ఈ సినిమా ఎంత పాపుల‌ర్ అంటే త‌ర్వాతి రోజుల్లో అవినీతి నాయ‌కుల‌ని వాహిని వారి పెద్ద‌మ‌నుషులు అని పిలిచేవారు. 3 గంట‌ల 11 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినిమాలో రేలంగి క్యారెక్ట‌ర్ హైలైట్‌. వాస్త‌వానికి ఈ సినిమాకి "ది ఫిల్ల‌ర్స్ ఆఫ్‌ సొసైటీ" అనే నాట‌కం ప్రేర‌ణ‌. (ర‌చ‌న-ఇబ్బ‌న్‌).

1960-70 కాలం కూడా మ‌రీ చెడిపోలేదు. కానీ హీరోలో మెల్లిగా తిరుగుబోతు, తాగుబోతు ల‌క్ష‌ణాలు మొద‌ల‌య్యాయి. సొసైటీలో కూడా అప్ప‌టి వ‌ర‌కూ మ‌ద్యానికి దూరంగా ఉన్న మ‌ధ్య‌త‌ర‌గ‌తి మందు అల‌వాటు చేసుకొంది. అయితే భ‌ర్త‌లు తాగి వ‌స్తే భార్య‌లు భోరున ఏడ్చే సీన్స్ ఉండేవి.

1970-80 దేశానికి క‌ష్ట‌కాలం. రాజ‌కీయాల ప‌త‌నం, ఎమ‌ర్జెన్సీ అనుభ‌వంలోకి వ‌చ్చాయి. ప్ర‌శ్నించే హీరోల‌కి బ‌దులు, తుపాకుల‌తో కాల్చే కౌబాయ్ హీరోలు, హీరోయిన్ల‌తో గంతులు వేసే హీరోలు వ‌చ్చారు. (య‌మ‌గోల‌లో ఎన్టీఆర్‌, జ‌య‌ప్ర‌ద‌ల డ్యాన్స్ చూస్తే అర్థ‌మ‌వుతుంది)

1980-90లో హీరో డాన్‌గా మారాడు. నేర‌స్త హీరోని జ‌నం అభిమానించ‌డం ప్రారంభించారు. హీరో స్మ‌గ్లింగ్ చేస్తూ పేద ప్ర‌జ‌ల‌ను కాపాడేవాడు. సొసైటీలోనూ తెర‌మీద గాఢ్ ఫాద‌ర్లు వ‌చ్చారు.

1990 నుంచి ఈ 30 ఏళ్ల‌లో హీరో ఒక్కో మెట్టు జారుతూ, ఇక దిగ‌డానికి మెట్లు లేకుండా పోయాడు. ఏ ప‌ని చేయ‌కుండా బేవ‌ర్స్‌గా తిరుగుతూ అమ్మాయిల వెంట ప‌డుతూ , మందు తాగుతూ, పోకిరీగా , ఇడియ‌ట్‌గా, జులాయిగా, కిరాయి హంత‌కుడిగా రూపాంత‌రం చెందాడు.

                                                                                 \7]
"|||||అత‌డు అనే సినిమాలో కిరాయి హ‌త్య‌లు చేసే హీరో మ‌హేశ్‌బాబు, త‌న స్థానంలో పొర‌పాటున చ‌నిపోయిన ఒక వ్య‌Sక్తి కుటుంబం కోసం చాలా చేస్తాడు. త‌న చేతుల‌తో ఎంద‌రినో చంపిన‌ప్పుడు రాని అప‌రాధ భావ‌న , త‌న కోసం ఎవ‌రో చ‌నిపోతే మాత్రం ఎందుకు వ‌స్తుంది?
సొసైటీలో రోల్‌మోడ‌ల్స్ లేన‌ప్పుడు
సినిమాల్లో మాత్రం ఎందుకు ఉంటారు?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp