నిర్భయ నిందితులకు ఉరి

By Kiran.G Dec. 10, 2019, 01:20 pm IST
నిర్భయ నిందితులకు ఉరి

నిర్భయపై పాశవికంగా అత్యచారానికి కారణమయిన నిందితులకు ఉరి శిక్ష అమలు చేయడానికి రంగం సిద్దమవుతుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత నిర్భయపై అత్యాచారం చేసిన నిందితులకు ఉరి శిక్ష అమలు చేయబోతున్నారు అధికారులు. 2012 డిసెంబర్ 16న కదులుతున్న బస్సులో నిర్భయపై ఆరుగురు నిందితులు అత్యాచారం చేసారు. 13 రోజులు మృత్యువుతో పోరాడి నిర్భయ కన్నుమూసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.ఆరుగురు నిందితులను గుర్తించి వారిని అరెస్ట్ చేసారు. వారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నాడు.మైనర్ బాలుడిని మూడేళ్ళపాటు బాల నేరస్థుల కారాగారానికి తరలించారు. కాగా రామ్ సింగ్ 2013లో తన కారాగారంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మిగిలిన నలుగురు నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది. వీరిలో అక్షయ్ ఠాకూర్, ముఖేష్ సింగ్,వినయ్ శర్మ లు తీహార్ జైల్లో ఉండగా, పవన్ గుప్తా మాత్రం మండోలీ కారాగారంలో ఉన్నారు.

పవన్ గుప్తాని మండోలీ కారాగారం నుండి, తీహార్ కారాగారానికి ఇప్పటికే తరలించారు. వీరిలో వినయ్ శర్మ ఒక్కడే రాష్ట్రపతి క్షమాభిక్షను కోరగా దానిని ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర కేబినెట్ తిరస్కరించాలని కోరాయి. ఇంతకు ముందు అhangingత్యాచారాలు చేసేవారికి క్షమాభిక్ష ఉండకూడదంటూ వారికి మరణ శిక్ష విధించాలని రామ్ నాధ్ కోవింద్ వ్యాఖ్యానించడం కూడా పరిగణలోకి తీసుకుంటే క్షమాభిక్ష లభించే అవకాశం లేదని తెలుస్తుంది. కాగా సోమవారం తనకు విధించిన మరణ శిక్షపై పునఃసమీక్షించాలని కోరుతూ అక్షయ్ ఠాకూర్ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేసాడు. గతంలో ముగ్గురు ఖైదీలు దాఖలు చేసిన ఇలాంటి పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. కావున నిర్భయ నిందితులకు ఉరి శిక్ష దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తుంది.

నిర్భయ నిందితులను ఉరి తీయడానికి ఉరి తాళ్లను బక్సర్ కారాగారంలో తయారుచేస్తున్నారు. నిర్భయ అత్యాచార ఘటన జరిగిన రోజునే అంటే డిసెంబర్ 16 నే నిర్భయ ఖైదీలను ఉరి తీయబోతున్నట్లు తెలుస్తుంది. దీనితో నిర్భయపై అత్యాచార ఘటన జరిగిన రోజే నిర్భయ నిందితులను ఉరి తీయడం ద్వారా నిర్భయకు న్యాయం జరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp