ప్రస్తుతమున్న బార్లను 40% తగ్గిస్తాం

By Kiran.G 19-11-2019 04:59 PM
ప్రస్తుతమున్న బార్లను 40% తగ్గిస్తాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని వేగవంతం చేశామని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి మీడియాతో అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బార్ల విధానంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష జరిపి, కొన్ని ఆదేశాలు జారీ చేసారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 798 బార్లను, 40% వరకు తగ్గిస్తామని, దానితోపాటు బార్లలో మద్యం సరఫరాని కూడా కుదిస్తామని తెలిపారు. జనవరి 1 నుండి ఇది అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం ఉన్న బార్లను తీసేసి కొత్త లైసెన్సులు ఇస్తామని, లాటరీ పద్దతి ద్వారా బార్ లైసెన్సులు ఇస్తామని నారాయణస్వామి వ్యాఖ్యానించారు.

ఉదయం 11 నుండి రాత్రి 10 వరకు మాత్రమే బార్లు తెరిచి ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. బార్లలో విక్రయించే మద్యం ధరలు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని, త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఎవరైనా మద్యాన్ని అక్రమ రవాణా చేసిన కల్తీ చేసినా భారీ జరిమానాతో పాటుగా జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసారు. మద్యపాన నిషేధ విషయంలో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి కోరారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News