రేవంత్, కేటీఆర్ "వైట్ ఛాలెంజ్" మధ్యలో దూరిన సీపీఐ నారాయణ

By Thati Ramesh Sep. 22, 2021, 09:41 pm IST
రేవంత్, కేటీఆర్ "వైట్ ఛాలెంజ్" మధ్యలో దూరిన  సీపీఐ నారాయణ

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం రేవంత్ వర్సెస్ కేటీఆర్ ఎపిసోడ్ నడుస్తోంది. రేవంత్ టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ పై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతకు ముందు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉన్న పొలిటికల్ ఫైట్ కాస్తా ప్రస్తుతం.. రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా మారింది. రేవంత్ విసిరిన వైట్ ఛాలెంజ్ కు ప్రతిస్పందనగా గులాబీ పార్టీ కార్యకర్తలు రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా రేవంత్ ఇంటి దగ్గర నిరసన తెలిపేందుకు వెళ్లగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. దీంతో రేవంత్, కేటీఆర్ ల మధ్య సవాళ్ల పర్వంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

రేవంత్ దూకుడు...

రేవంత్- కేటీఆర్ మధ్య సాగుతున్న సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వంలో రాజకీయంగా కాంగ్రెస్ నే పై చేయి సాధించనట్లు కనబడుతోంది. పీసీపీ అధ్యక్షుడైన తర్వాత రేవంత్ తన సహజ వైఖరైన దూకుడును మరింత పెంచారు. పీసీసీగా హైకమాండ్ తన పేరును ప్రకటించినప్పటి నుంచి మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రత్యర్థులపై ముఖ్యంగా టీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూనే కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ను ఏ అంశంలోనూ వదడలం లేదు. దీంతో రేవంత్ చేసే విమర్శలకు అధికారపార్టీ వివరణ లేదా ప్రతివిమర్శలు చేయాల్సిన సిచ్వ్యేషన్ క్రియేట్ అయింది.

Also Read : తెలంగాణకు గట్టి షాక్, పాలమూరు-రంగారెడ్డి ఆపాలని NGT ఆదేశం

రేవంత్ స్పందిస్తున్న వైఖరికి తోడు టీఆర్ఎస్ ప్రతి స్పందిస్తున్న తీరుతో రేవంత్ మాస్ లీడర్ గా బాగా ప్రొజెక్టు అవుతున్నారు. విపక్ష నేతలతో పాటు ప్రజల నుంచి కూడా సానుభూతి సంపాదించుకుంటున్నారు. ఇందులో భాగంగానే రేవంత్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని అఖిలపక్షం ఖండిస్తుందని సీపీఐ నేత నారాయణ ప్రకటించారు. ఇళ్ల పై దాడులు చేయడం నీచ సంస్కృతికి నిదర్శనమన్న నారాయణ.. దమ్ముంటే డైరెక్టుగా రావాలని అప్పుడు చూసుకుందామని మరో ఛాలెంజ్ విసిరారు. రేవంత్ రెడ్డి తో మల్లయుద్ధం చేయాలన్నారు. అధికారంలో ఉన్నవాళ్లు అభివృద్ధి కార్యక్రమాలతోనే విపక్షాల విమర్శలకు సమాధానం చెప్పలని సూచిస్తున్నారు. వ్యక్తగతమైన దాడులకు పాల్పడటం సరికాదని హితువు పలుకుతున్నారు.

శశి థరూర్ విషయంలోనూ .

కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీఆర్ఎస్ హైలెట్ చేసినప్పటికీ రేవంత్ కు పార్టీ పరంగా ఎలాంటి నష్టం జరగలేదు. అసలు ఆ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనే జరగలేదు. తర్వాత రేవంత్ రెడ్డి.. శశి థరూర్ కు సారీ చెప్పగా ఆయన ఆమోదించారు. అంటే రేవంత్ రెడ్డి ఎదుర్కోనేందుకు టీఆర్ఎస్ పార్టీ వేస్తున్న ప్రతివ్యూహాలు ఇప్పటి వరకు విఫలమయ్యాయనే చెప్పాలి. ఈ విషయంలో టీఆర్ఎస్ కు ఎలాంటి మైలేజ్ దక్కలేదనే చెప్పవచ్చు.

అయితే ఈ విషయంపై టీఆర్ఎస్ శ్రేణులు స్పందిస్తూ .. రేవంత్ రెడ్డి నైజాన్ని ప్రజలకు తెలియజెప్పడమే తమ ఉద్దేశమంటున్నారు. రేవంత్ కారణంగా టీఆర్ఎస్ కు రాజకీయంగా జరిగే నష్టమేమీ లేదని చెబుతున్నారు. రేవంత్ కు గ్రౌండ్ లెవల్ లో బలం ఉంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సవాల్ విసురుతున్నారు.

Also Read : అదానీ రావడం లేదని నాడు - వచ్చేస్తున్నాడని నేడు, ఆంధ్రజ్యోతి అక్కసు రాతలు

వైట్ ఛాలెంజ్ తో పొలిటికల్ హీట్..

ఇప్పటి వరకు తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ పదం మాత్రమే వినపడేది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం మాత్రం వైట్ ఛాలెంజ్ చుట్టూ తిరుగుతోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో కేటీఆర్, కొండా విశ్వేశ్వరరెడ్డికి, రేవంత్ వైట్ ఛాలెంజ్ విసిరారు. తనతో పాటు కేటీఆర్, బండి సంజయ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, , డ్రగ్స్ టెస్ట్ చేయించుకుని.. యువతకు ఆదర్శంగా నిలుద్దామన్నారు. కొండా విశ్వేశ్వరెడ్డి ఈ ఛాలెంజ్ కు స్వీకరించారు. ఏ ఛాలెంజైనా తనకు ఓకే అన్న బండి సంజయ్ .. ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడి రమ్మంటే అక్కడికి వస్తానని రిప్లై ఇచ్చారు.

మీ నాయకుడు రాహుల్ రెడీనా... ?

రేవంత్ ఛాలెంజ్ పై స్పందించిన కేటీఆర్.. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన రాహుల్ .. డ్రగ్స్ టెస్ట్ కు వస్తే తాను కూడా సిద్ధమన్నారు. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో కలిసి టెస్ట్ వెళితే తన గౌరవం తగ్గుతుందన్నారు. ఓటుకు నోటు కేసులో లైడిటెక్టర్ పరీక్షకు రేవంత్ సిద్ధమా అంటూ కేటీఆర్ ఎదురు ప్రశ్న వేశారు.

రేవంత్ తన పై చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కోర్టును ఆశ్రయించగా తీర్పు రిజర్వులో ఉంది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ పై ఎలాంటి ఆరోపణలు చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పు తర్వాత ఈ చాలెంజ్ ల ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడే అవకాశముంది.

Also Read : అభ్యర్థి మాట్లాడుతుంటే వెళ్లిపోతున్నారు..! హుజురాబాద్‌లో ఏం జరుగుతోంది..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp