రూల్ పాటించకపోవటం విచక్షణా?

By Siva Racharla Jan. 23, 2020, 08:27 am IST
రూల్ పాటించకపోవటం విచక్షణా?

రాజధాని వికేంద్రీకరణ బిల్లును మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపటం మీద జరుగుతున్న చర్చలో అసలు ఆయన ఏమన్నాడో మీడియా రాయలేదు..

ఆంధ్రజ్యోతి లోపల పేజీలో చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన సోము వీర్రాజు అభిప్రాయాన్ని వార్త రెండవ భాగంగా వేసింది. ఈనాడు రెండవ పేజీలో చైర్మన్ అన్న మాటలను రాసింది... సాక్షి రెండవ పేజీలో వైసీపీ ,బీజేపీ,పిడిఎఫ్ సభ్యుల అభిప్రాయాలతో పాటు సీనియర్ నేత,గత నాలుగు సంవత్సరాలుగా టీడీపీ లో ఉన్న గాదె వెంకట్ రెడ్డి,మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అభిప్రాయాన్ని వేసింది...టీడీపీ యేతర సభ్యులు ముఖ్యంగా పిడిఎఫ్ ,బీజేపీ సభ్యులు కూడా చైర్మన్ నిర్ణయానికి మద్దతు తెలపలేదు,ఆ నిర్ణయం సరైంది కాదని చైర్మన్ వైఖరిని తప్పుపట్టారు.

సెలెక్ట్ కమిటీ కి పంపే ముందు చైర్మన్ అన్న మాటలు యధాతధంగా... ప్ర‌భుత్వ ప‌రంగా ఏదైతే బిల్లులు ఇచ్చారో బిల్లులు వ‌చ్చాయో ప్ర‌భుత్వ బిల్లుల‌కు మీరు ప్రాధాన్యత ఇచ్చి రూల్ ప్ర‌కారం రాని ప్ర‌తిపాద‌న‌ను మీరు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం క‌రెక్టు కాద‌ని ప్ర‌భుత్వ ప‌రంగా పిడిఎఫ్ నాయ‌కులు, బీజేపీ నాయ‌కులు చెప్ప‌డం.

Read Also: రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు బ్రేక్ - అనుకున్నది సాధించిన టీడీపీ

ఈ ప‌రిస్థితుల్లో నాకు సంక్లిష్ట ప‌రిస్థితి ఏర్ప‌డింది.
రూల్ ప‌రంగా లేద‌ని అంశం సుస్ప‌ష్టంగా క‌న‌బడుతుంది.
దాన్ని ఏర‌కంగా అతిక్ర‌మించాల‌నేది ఆలోచ‌న కూడా చేశారు.
ఆ ఆలోచ‌న ఎంత వ‌ర‌కు స‌బ‌బుగా ఉంటుంద‌నేది ఆలోచ‌న చేయాల్సిన అవ‌స‌రం ఉంది.
నాకు కొంత సందిగ్దంగా ఉంది. అయిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికే చాలా కాలాతీతం అయ్యింది.
ఇటువంటి ప‌రిస్థితుల్లో ఇంకాదీని కోసం ఆలోచ‌న చేసుకుంటూ కాల‌యాప‌న చేయ‌డం స‌రైన‌ది కాద‌ని నా ఉద్దేశం.
అందుక‌నే ఏదైతే రూల్స్ కు అనుగుణంగా లేక‌పోవ‌డం వ‌ల్ల సెల‌క్ట్ క‌మిటీకి పంపించే ప‌రిస్థితి లేనందున ఏదేమైన‌ప్ప‌టికీ నాకున్న రూల్ 154 విచ‌క్ష‌ణా అధికారాల‌కు లోబ‌డి ఈ బిల్లును సెల‌క్ట్ క‌మిటీకి పంపించ‌డం జ‌రుగుతుంది.

బిల్లును సెలెక్ట్ కమిటీ కి పంపటానికి రూల్స్ అంగీకరించవు అని అతి స్పష్టంగా పేర్కొన్న చైర్మన్ ఇప్పటికే కాలాతీతం అయ్యింది కాబట్టి... ఈమాట ఇంతటితో ఆగిపోతే వినేవాళ్ళు లేక వీడియో చూసేవాళ్ళు ఏమనుకుంటారు? చైర్మన్ బిల్లుకు ఆమోదం తెలుపుతున్నారని భావిస్తారు.. ఎందుకంటే అదే విచక్షణ ...

కానీ చైర్మన్ మాత్రం నాకు సందిగ్ధత ఉంది ,రూల్స్ అంగీకరించకపోయినా నా విచక్షణా అధికారంతో బిల్లును సెలెక్ట్ కమిటీ కి పంపుతున్నాను అని ప్రకటించి మండలిని వాయిదా వేసి వెళ్లిపోయారు...

Read Also: మండలి నిరవధిక వాయిదా... తర్వాత సమావేశాలు..

చైర్మన్ చేసింది రూల్స్ అంటే చట్టవిరుద్ధం అని ఆయనే చెప్పిన తరువాత మండలి నిర్ణయాన్ని శాసనసభ ఎందుకు అంగీకరిస్తుంది?మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి చెప్పినట్లు మండలి చైర్మన్ నిర్ణయాన్ని శాసనసభ తిరస్కరిస్తే ఏమవుతుంది?సవరణలు లేని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపటమే రాజ్యాంగవిరుద్దం అయినప్పుడు మండలి నిర్ణయాన్ని శాసనసభ తిరస్కరించటం రాజ్యాంగబద్దమా కాదా?అన్న చర్చే రాదు..

రాజ్యాంగం ప్రకారం మండలి నిర్ణయాధికార వ్యవస్థ కాదు.. శాసనసభ చేసిన బిల్లుకు సూచనలు,సవరణలు మాత్రమే ప్రతిపాదించగలదు ...దీని మీద ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు... ఈ రోజు శాసనసభ మండలి సెలెక్ట్ నిర్ణయాన్ని తిరస్కరించినా రాజ్యాంగ సంక్షోభం ఏమి ఏర్పడదు ... వాస్తవానికి సలెక్ట్ కమిటీకి బిల్లును పంపి మండలి చైర్మన్ రాజ్యాంగ సంక్షోభం సృష్టించారు...

మండలి నిర్ణయంతో రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఆగిపోయినట్లు జరుగుతున్న ప్రచారం మభ్యపెట్టటమే.. ఈ మూడు నెలలో ఏమైనా జరగొచ్చు అన్న వాదన లోతు ఏమిటో రెండు,మూడు రోజుల్లో తేలిపోతుంది... ఏమి చేసైనా రాజధాని వికేంద్రీకరణను కోర్టు మెట్లు ఎక్కించాలని ,ఆవిధంగా కోర్టు తీర్పు వచ్చే వరకు రాజధాని వికేంద్రీకరణను ఆపాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రభుత్వం ఎటువంటి పైఎత్తు ఇస్తుందో చూడాలి..

Read Also: చైర్మన్ నిర్ణయం సిగ్గుచేటన్న మంత్రి

ఆర్డినెన్సు తీసుకు రావటం అనే ఆప్షన్ ను చివరిగా ఉపయోగించాలి,శాసనసభల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆర్డినెన్సు తీసుకువచ్చే వీలు లేదు. సభలను ప్రోరోగ్ చేసి అప్పుడు ఆర్డినెన్సు తీసుకురావాలి.. దీనికి గవర్నర్ మద్దతు అవసరం.

ప్రభుత్వం ఈ సమస్యను రాజకీయంగా అంటే టీడీపీ ఎమ్మెల్సీ లను చీల్చటం ద్వారా కాకుండా శాసనసభకు ఉన్న హక్కుల ద్వారానే పరిష్కరించాలి...ఇప్పుడున్న రూపంలో బిల్లుకు ఆమోదం దక్కదు అని భావిస్తే బిల్లును ద్రవ్య బిల్లుగా మార్చటం లేక ఉమ్మడి సమావేశం పెట్టటం లాంటి ప్రత్యమ్నాయాలు పరిశీలించాలి.. రాజ్యంగంలో ఉమ్మడి సమావేశం లేదని చేస్తున్న వాదన నిలవదు.. ఏ కోర్టు అడ్డుకోజాలదు...

అతి వాస్తవం ఏమిటంటే చైర్మన్ నిర్ణయంతో రాజధాని వికేంద్రీకరణ ఆగదు ,ఆలస్యం కూడా కాదు.. కార్యాలయాల తరలింపు కొనసాగుతుంది..అధికార గుర్తింపు మాత్రమే ఆలస్యం అవుతుంది... ఇంతకూ 2015 నుంచి ఆంధ్రప్రదేశ్ "అధికారిక" రాజధాని ఏది?ఆ అధికారిక రాజధాని నుంచే ప్రభుత్వం పనిచేస్తుందా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp