ఇదీ.. జగన్‌ సత్తా

By Karthik P Jun. 20, 2021, 03:04 pm IST
ఇదీ.. జగన్‌ సత్తా

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకుపట్టుకుని చూస్తే చాలంటారు. అలానే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వ పాలన సత్తా ఏమిటో ఈ రోజు జరిగిన కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ద్వారా తేటతెల్లమైంది. దేశ వ్యాప్తంగా ఈ రోజు ఆదివారం ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఏపీ మినహా దేశ వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు 18,44,574 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా.. ఒక్క ఏపీలో 9,02,354 మందికి వ్యాక్సిన్‌ అందించడం విశేషం.

సచివాలయ వ్యవస్థతో..

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏమిటో ఇప్పటికే అర్థమైంది. తాజాగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సచివాలయాల ప్రాముఖ్యతను మరోమారు చాటిచెప్పింది. దేశంతో పోటీ పడేలా... వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరిగిందంటే.. అందుకు ప్రధాన కారణం సచివాలయ వ్యవస్థే. గ్రామ స్థాయిలో మౌలిక వసతులు, సిబ్బంది అందుబాటులో ఉండడంతో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఏపీ ఎదుర్కొనేందుకు అవకాశం ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే గాంధీ జయంతి నాడు.. సీఎం వైఎస్‌ జగన్‌ దేశంలోనే తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పక్కా భవనాలు నిర్మించడంతోపాటు.. 1.20 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు, దాదాపు 2.70 లక్షల మంది వలంటీర్లను నియమించారు.

30 రోజుల్లో అందరికీ..

సరిపడా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే.. రాష్ట్ర ప్రజలందరికీ కేవలం 30 రోజుల్లో వ్యాక్సిన్‌ వేసే శక్తి ఆంధ్రప్రదేశ్‌కు ఉందని తాజాగా రుజువైంది. రాష్ట్ర జనాభా దాదాపు 5.30 కోట్లు. ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటలకే 9 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే మరో 3 లక్షల మందికి వేసేందుకు అవకాశం ఉంది. ఈ లెక్కన రోజుకు ఏపీలో 12 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసే యంత్రాంగం అందుబాటులో ఉంది. సరిపడా వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటే.. రోజుకు 12 లక్షల మంది చొప్పన 30 రోజుల్లో 3.60 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయగలరు. కేవలం నెల రోజుల్లో ఏపీలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముగిస్తారు. కావాల్సిందల్లా సరిపడా వ్యాక్సిన్‌ మాత్రమే.

Also Read : వ్యాక్సినేషన్ లో ఏపీ ప్రభుత్వ మెగా డ్రైవ్ మరో ముందడుగు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp