టెన్షన్ పెంచేస్తున్న కరోనా బాధితుల లెక్కలు.. ?

By iDream Post Apr. 05, 2020, 12:17 pm IST
టెన్షన్ పెంచేస్తున్న కరోనా బాధితుల లెక్కలు.. ?

ప్రస్తుతం యావత్ ప్రపంచదేశాలను వణికించేస్తున్న కరోనా వైరస్ ధాటికి బాధితుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. బాధితుల సంఖ్య అయినా, మృతుల సంఖ్య అయినా నిమిష నిమిషానికి పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదంతా ఏ స్ధాయిలో ఉందంటే నిమిష నిమిషానికే బాధితులు, మరణాల సంఖ్య మరిపోతోందంటేనే తీవ్రత ఏ స్ధాయిలో ఉందో అర్ధమైపోతోంది.

ఐసొలేషన్, క్వారంటైన్ సెంటర్లో బాధితుల సంగతి ఎలాగున్నా బయట తిరుగుతున్న వాళ్ళతోనే సమస్యలు పెరిగిపోతున్నాయి. బయట తిరుగుతున్న వాళ్ళల్లో ఎంతమందికి వైరస్ సోకిందో కూడా చూసుకోకుండానే తిరిగేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ప్రార్ధనలు చేసి తర్వాత తిరిగి రాష్ట్రాలకు చేరుకున్న వారి ద్వారానే వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. అయితే ఢిల్లీలో ప్రార్ధనలు చేసిన వాళ్ళలో ఇంకా కొందరు పరీక్షల నుండి తప్పించుకు తిరుగుతున్నారన్న సమాచారమే అందరిలోను ఆందోళన పెంచేస్తోంది.

ఇపుడు కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య కూడా అలాగే నిమిష నిమిషానికి మారిపోతోంది. ఒకటా రెండా ప్రపంచంలోని దాదాపు 200 దేశాల్లో వైరస్ బాధితుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. బాధితుల సంఖ్య కూడా ఏ రేంజిలో పెరిగిపోతోందంటే ఒక ఛానల్లో చూసి రెండు ఛానళ్ళు మార్చేలోగానే మనం చూసిన సంఖ్య మారిపోతోంది. బాధితుల సంఖ్య, మరణాల సంఖ్య అయితే వార్తలు రాసి అప్ లోడ్ చేసేలోపే అంకెలు మారిపోతున్నాయి.

ఈ స్ధాయిలో బాధితుల సంఖ్య పెరిగిపోతుండటం బహుశా ముందు తరాల్లో కూడా ఎవరూ చూసుండరేమో ? గతంలో ఎప్పుడో కలరా వచ్చినపుడు కూడా జనాలు ఇలాగే చనిపోయారని చెప్పుకోవటమే కానీ చూసిన వాళ్ళు ఇపుడు ఎవరూ లేరు. గడచిన నాలుగైదు దశాబ్దాల్లో కూడా ఏ అంటురోగం వల్ల కూడా ఇన్ని వేల మంది బాధితులు, చనిపోయిన వాళ్ళు లేరనే చెప్పాలి. ఇక భూకంపాలు, తుపానుల వల్ల కూడా లక్షల మంది బాధితులు లేరు. ఇదేమి మహమ్మారో ఏమో కానీ కరోనా వైరస్ మాత్రం యావత్ ప్రపంచదేశాలను ఆగమాగం చేసేస్తోంది ఒక్క దెబ్బకు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నట్లు భగవంతుడే కాపాడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp