భారత్ లో 40 వేలకు చేరువలో కరోనా మరణాలు

By Kiran.G Aug. 05, 2020, 11:16 am IST
భారత్ లో 40 వేలకు చేరువలో కరోనా మరణాలు

ఒక్కరోజులో 52,509 పాజిటివ్ కేసులు - 857 మరణాలు

దేశంలో కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడటం లేదు. దేశంలో కొద్దిరోజులుగా ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తున్న కరోనాను అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలయత్నంగానే మిగిలిపోతున్నాయి. గత కొద్దిరోజుల నుండి 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 52,509 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 19,08,254 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 39,795 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజులో 857 మరణాలు సంభవించాయి.. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ బారినుండి 12,81,660 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 5,84,684 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది.మహారాష్ట్ర తర్వాత అత్యధిక స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో 9747 కొత్త  కేసులు నమోదయ్యాయి.. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 1,73,333 మందికి కరోనా సోకగా 1604 మంది మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే 67 మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగించే విషయం. 96,625 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్  అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 79,104 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణాలో గడచిన 24 గంటల్లో 2,012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,958 కి చేరింది. కరోనా కారణంగా 13 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 576 కి చేరింది. 49,675 మంది వ్యాధి నుండి కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 19,568 ఆక్టీవ్ కేసులు ఉన్నాయి..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp