కేసీఆర్ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌

By Kalyan.S Oct. 24, 2020, 08:40 am IST
కేసీఆర్ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌

దసరా మరుసటి రోజు సెలవుగా ప్రకటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి ఏడాది దసరా మరుసటి రోజు (ఈ నెల అక్టోబర్‌ 26) సెలవుగా షెడ్యూల్ రూపొందించాలి అన్నారు. ఈ నిర్ణ‌యం తెలంగాణ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌ పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రస్తుతం డీఏ ఎంత అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని, రాష్ట్రాలు కేంద్ర నిర్ణయాన్ని అనుసరిస్తున్నాయి స్పష్టం చేశారు. కేంద్రం జాప్యం వల్ల డీఏ బకాయిలు పేరుకుపోతున్నాయి విమర్శించారు. ప్రతి 6 నెలలకు రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏ నిర్ణయించాలని, కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే సవరించాలని అధికారులకు సూచించారు. కేబినెట్‌లో చర్చించి డీఏపై విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. 2019 జులై 1 నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే ఉద్యోగులకు చెల్లించాలి.. డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

29న ధరణి పోర్టల్

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 29న ధరణి పోర్టల్ సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. ఇప్ప‌టికే సినీ, రాజ‌కీయ‌, వ్యాపార ప్ర‌ముఖులు స‌హా చాలా మంది ధ‌ర‌ణిలో త‌మ ఆస్తుల‌ను న‌మోదు చేయించుకున్నారు. తెలంగాణలో వరద సాయం చేసేందుకు ఉద్యోగులు ముందుకొచ్చారు. ఒక రోజు వేతనాన్ని విరాళంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు. వారి నిర్ణయంతో దాదాపు రూ.33కోట్ల విరాళం ప్రభుత్వానికి అందనుంది. రైతు సంక్షేమం - వ్యవసాయాభివృద్ధి కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రైతులను సంఘటిత శక్తిగా మలిచింది. రైతులను సమన్వయ పరిచి దేశంలోనే మొదటి సారిగా నిర్ణీత పంటల సాగు విధానం అమలు అవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp