ఆ వెబ్‌సైట్లను నిషేధించండి-సీఎం జగన్ లేఖ

By Kiran.G Oct. 29, 2020, 07:02 am IST
ఆ వెబ్‌సైట్లను నిషేధించండి-సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు రాష్ట్రంలో ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌, బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌లను నిషేధించాలని కోరుతూ లేఖ రాశారు.

యువత బెట్టింగ్‌, గాంబ్లింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లకు బానిసలుగా మారుతున్నారని,ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతున్నారని లేఖలో జగన్ పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో 1974 ఏపీ గేమింగ్‌ చట్టంలో సవరణలు తీసుకొచ్చి అమలుచేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. కానీ బెట్టింగ్ వేయడంతో పాటు బెట్టింగ్ కి సహకరించడం కూడా చట్టం ప్రకారం నేరమని జగన్ పేర్కొంటూ బెట్టింగ్ లో యువతకు సహాయం చేస్తున్న ఆన్లైన్ గాంబ్లింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ కేంద్రమంత్రి రవిశంకర్ ను కోరారు.

బయట జరిగే జూదాన్ని, బెట్టింగులను గుర్తించడం సులువని, కానీ ఆన్లైన్ ద్వారా జరిగే బెట్టింగులను నియంత్రించాలి అంటే గాంబ్లింగ్‌ యాప్‌లు, వెబ్‌సైట్లను నిషేధించాలని లేఖలో సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలో మొత్తం 132 వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌ గాంబ్లింగ్‌, బెట్టింగ్‌కు కారణమవుతున్నాయని వాటిని నిషేధించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. బెట్టింగులు నిర్వహించే ఆన్లైన్ వెబ్‌సైట్ల పేర్లను కూడా లేఖలో ముఖ్యమంత్రి జగన్ పొందుపరిచారు.కాగా ముఖ్యమంత్రి లేఖపై కేంద్రమంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp