బాపు మ్యూజియాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం జగన్

By Kiran.G Oct. 01, 2020, 08:41 am IST
బాపు మ్యూజియాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం జగన్

పదేళ్ల క్రితం విజయవాడలో మూతబడ్డ బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. బాపు మ్యూజియానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా జగన్ సర్కారు నిర్ణయించింది. అందుకోసం 8 కోట్ల రూపాయలను వెచ్చించి బాపు మ్యూజియాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

దాదాపు పది లక్షల సంవత్సరాల క్రితం నాటి 1,500 అరుదైన వస్తువులను బాపు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. జైన, బుద్ద, హిందూ విగ్రహాలు, రాజుల కాలంలో వాడిన కత్తులు, నాణాలతో పాటు ఆది మానవుడు దగ్గర నుంచి ఆధునిక మానవుడి వరకూ ఉపయోగించిన కళాఖండాలు, వస్తువులు, వంట సామాగ్రి వస్త్రాలను మ్యూజియంలో సందర్శకులు వీక్షించేందుకు అందుబాటులో ఉంచారు. పురాతన వస్తువుల వివరాల తెలుసుకునేందుకు సందర్శకులకి అత్యాధుక సాంకేతిక‌ పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకువచ్చారు. నూతన టెక్నాలజీ ద్వారా వస్తువుల వివరాలు ఫోన్‌లోనే చూసేలా ప్రత్యేక యాప్ ను కూడా రూపొందించారు. బాపు మ్యూజియం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ చిత్రాలను స్కాన్ చేస్తే వాటి చరిత్రను మన ఫోన్ లో మాటల ద్వారా వినేలా అప్లికేషన్ రూపొందించారు.

కాగా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మ్యూజియాన్ని ప్రారంభించిన తర్వాత, ఈనెల 2వ తేదీ నుండి గాంధీ జయంతి నసందర్భంగా బాపు మ్యూజియాన్ని నగర ప్రజలు సందర్శించేందుకు అందుబాటులో ఉంచనున్నారు. మ్యూజియంలోని ఇంటరాక్టివ్‌ కియోస్క్‌ని అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేశామని వాణి వెల్లడించారు. ఇక మ్యూజియంలో లేజర్ షోను ఒకటి, రెండు నెలలో ప్రారంభిస్తామని ఆర్కియాలజి కమిషనర్ వాణి మోహన్ తెలిపారు. చరిత్ర సంపదను ప్రజలకు అందుబాటులో ఉంచేలా మూతపడిన మ్యూజియాన్ని అభివృద్ధి చేసి ప్రారంభింస్తున్న జగన్ ప్రభుత్వ చర్యలపట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp