సియం జగన్ చొరవ - అమృత్ ప్రాజెక్టుకు 791.50 కోట్లు

By iDream Post Mar. 25, 2020, 04:30 pm IST
సియం జగన్ చొరవ - అమృత్ ప్రాజెక్టుకు 791.50 కోట్లు

పెరుగుతున్న పట్టణ జనాభా అవసరాలకు అనుగుణంగా, పట్టణాలకు మౌలిక వసతులు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2015 జూన్ లో మొదలుపెట్టిన అటల్‌ మిషన్‌ ఫర్‌ రిజువనేషన్‌ అండ్‌ అర్బన్‌ ట్రాన్స్‌పార్మేషన్‌ (అమృత్‌) పథకం ఇప్పటివరకు రాష్ట్రంలో అనేక ఒడుదుడుకుల మధ్య నడుస్తూ వచ్చింది ఈ పథకానికి అయ్యే పూర్తి వ్యయంలో కొంత కేంద్రం, మరికొంత రాష్ట్రం భరించాలి. 2015-2020 మధ్య ఏపీలో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.2890 కోట్లుగా నిర్ధారించిన కేంద్రం, తన వాటాగా రూ.1057 కోట్లను రాష్ట్రంలోని 33 పట్టణాలకు కేటాయిస్తునట్టు ప్రకటించింది. మిగతా మొత్తాన్ని ఆయా స్థానిక సంస్థలు సమీకరించుకోవాలని నిర్దేశించింది.

అయితే గత ప్రభుత్వంలో కేంద్రం ఇచ్చిన నిధులను సైతం పట్టణాభివృద్ధి, గృహవసతికి వాడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు వినియోగించుకున్నదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి ఉదాహరణగా ఈ పథకం కింద రాజధాని అమరావతిలో మురిగినీటి వ్యవస్థ ఏర్పాటు చేయటానికి చేసిన కేటాయింపులు దేనికి ఉపయోగించారో అనే ప్రశ్నకు నాటి తెలుగుదేశం దగ్గర సమాధానం లేదు. అయితే వై.యస్ జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పటి వరకు నత్తనడకగా సాగిన అమృత్ పథకం పనుల్లో కాస్తే వేగం పుంజుకుందనే చెప్పాలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తొలి 2019-20 బడ్జెట్లోనే అమృత్ స్కీంకు రూ.373 కోట్లు కేటాయించారు ముఖ్యమంత్రి జగన్.

ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబందించి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పట్టణాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ప్రాజెక్టుల పూర్తికి 791.50 కోట్లు బ్యాంకు రుణాన్ని ప్రభుత్వం సమకూర్చనుంది. వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ తాజాగ ఏడాది గడువు పెంచడంతో రాష్ట్ర వాటాకిందకు వచ్చిన నిధులు సమకూర్చుకునేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు నగరపాలక సంస్థ తరుపున బ్యాంకు నుండి రుణం తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈ మేరకు పురపాలన నగరపాలక సంస్థలకు విడుదలయ్యే ఆర్ధిక సంఘం నిధులు నుంచి రుణం తిరిగి చెల్లిస్తామనే హామీ ప్రభుత్వం బ్యాంకులకు ఇచ్చింది. దీంతో అమృత్ ప్రాజెక్టుకు 791.50 కోట్లు నిధులు సమకూరాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జాప్యం వలన కుంటుపడిన అమృత్ ప్రాజక్టు పనులు మరింత వేగంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp