అగ్నిప్రమాదంపై ఆరా తీసిన జగన్..

By Kiran.G Aug. 09, 2020, 08:49 am IST
అగ్నిప్రమాదంపై ఆరా తీసిన జగన్..

ఈరోజు ఉదయం విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రమేష్ హాస్పిటల్ స్వర్ణ ప్యాలెస్ ను లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చింది. కాగా ఈ ఉదయం స్వర్ణ ప్యాలెస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. కొందరు భయంతో పై అంతస్తుల నుండి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి.

కాగా ఈ ఘటన గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. తక్షణ చర్యలు చేపట్టాలని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై లోతుగా విచారణ జరపాలని సంఘటన జరగడానికి గల కారణాలను తనకు తెలియజేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp