క‌రోనాపై పోరు.. పాల‌న‌లోనూ జోరు : ఏపీ ర్యాంకుల‌కు కార‌ణ‌మ‌దే!

By Kalyan.S Aug. 08, 2020, 08:10 pm IST
క‌రోనాపై పోరు.. పాల‌న‌లోనూ జోరు : ఏపీ ర్యాంకుల‌కు కార‌ణ‌మ‌దే!

క‌రోనాపై పోరుకు నిరంత‌రం శ్ర‌మిస్తున్నా... పాల‌నాప‌ర‌మైన ఇత‌ర అంశాల్లో కూడా ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. సంక్షేమ ప‌థ‌కాల జోరు ఏమాత్ర‌మూ ఆప‌డం లేదు. అన్ని అంశాల్లోనూ ఇత‌ర రాష్ట్రాల క‌న్నా.. ముందుగానే నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ప్ర‌జ‌లకు ఇచ్చిన హామీల‌ను నెర‌వేరుస్తూనే ఉంది. కాపు నేస్తం, జ‌గ‌న‌న్నఆస‌రా, సున్నా వ‌డ్డీకే రుణాలు, ఆటో డ్రైవ‌ర్లకు స‌హాయం.. ఇలా ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతూనే ఉంది. అలాగే విద్యా సంబంధిత కార్య‌క్ర‌మాల‌లోనూ ముందంజ‌లో ఉంది. పాఠ‌శాల‌లు, డిగ్రీ క‌ళాశాల‌ల ప్రారంభానికి సంబంధించిన తేదీల‌ను ఇత‌ర రాష్ట్రాల కంటే ముందుగానే ప్ర‌క‌టించింది. ఒక‌వైపు క‌రోనా క‌ట్ట‌డికి కృషి చేస్తూనే.. మ‌రో వైపు అభివృద్ధి కార్యక్ర‌మాల‌కు సంబంధించి ఎక్క‌డా ఆటంకాలు లేకుండా కొన‌సాగిస్తోంది. శాఖ‌ల వారీగా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు, లోటుపాట్ల‌ను తెలుసుకుంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మో్హ‌న్ రెడ్డి అన్ని అంశాల‌నూ నిశితంగా ప‌రిశీలిస్తూ అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

ఏపీకి పెరుగుతున్న ప్ర‌తిష్ఠ‌

జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అనంత‌రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తీసుకొచ్చిన సంస్క‌ర‌ణ‌లు రాష్ర్టాన్ని దేశంలోనే ముందు వ‌రుస‌లో నిలుపుతున్నాయి. ఏ స‌ర్వే చూసినా ఏపీకి మంచి మార్కులే వ‌స్తున్నాయి. గ‌తంలో సీ ఓట‌ర్ నిర్వ‌హించిన స‌ర్వేలోనూ దేశంలోనే 4వ స్థానంలో నిలిచి సీఎం జ‌గ‌న్ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు. తొలిసారి పాల‌న‌లోనే విభిన్న పంథా అవ‌లంభించి ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొంద‌డంలో స‌ఫ‌లీకృతుల‌య్యారు. రాజ‌కీయంగాను, పాల‌న‌లోను ఎంతో అనుభ‌వం ఉన్న వారి కంటే జ‌గ‌న్ కు ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. ఇప్పుడు తాజాగా మూడ్ ఆఫ్ ది నేష‌న్ పేరుతో ఇండియా టుడే నిర్వ‌హించిన స‌ర్వేలో కూడా జ‌గ‌న్ టాప్ 3లో నిలిచారు. మూడు సార్లు నంబ‌ర్ వ‌న్ సీఎంగా ర్యాంక్ పొందిన ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కంటే ఓ స్థానం ముందు వర‌స‌లో జ‌గ‌న్ ఉండ‌డం ప్ర‌ముఖుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఆయ‌న తీసుకొస్తున్న సంస్క‌ర‌ణ‌లే ఏపీ ప్ర‌తిష్ట పెరిగేందుకు దోహ‌ద‌ప‌డుతున్నాయ‌ని రాజ‌కీయ నిపుణులు భావిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp