భ‌విష్య‌త్ లోనూ అవే ఫ‌లితాలు : సీఎం జ‌గ‌న్ ధీమా

By Kalyan.S Sep. 24, 2021, 01:00 pm IST
భ‌విష్య‌త్ లోనూ అవే ఫ‌లితాలు : సీఎం జ‌గ‌న్ ధీమా

అవును నిజ‌మే.. వ‌రుస‌గా ప్ర‌జా తీర్పును ప‌రిశీలిస్తే ఎవ‌రికైనా ఆ ధీమా త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. అందులోనూ విజ‌యాలే కాదు.. రికార్డులు సృష్టిస్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నోట ఆ మాట‌లు రావ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. ఆయ‌న ప‌నితీరు, స‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్న శైలికి జ‌నం ముగ్దుల‌వుతున్నారు. పెర‌గ‌డ‌మే కానీ, త‌ర‌గ‌ని ప్ర‌జాభిమానానికి ఎన్నిక‌ల తీర్పులు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. అందుకే 2024 ఎన్నిక‌ల్లోనే కాదు.. భ‌విష్య‌త్ లోనూ అంటే మూడో సారి కూడా అధికారంలోకి రాగ‌ల‌మ‌న్న ధీమా జ‌గ‌న్ లో క‌నిపిస్తోంది. ఆయ‌న వేస్తున్న అడుగులు కూడా అలాగే క‌నిపిస్తున్నాయి.

బ‌హుశా దేశ చ‌రిత్ర‌లోనే...

విజ‌య విహారంతో జ‌గ‌న్ లో ఇసుమంతైనా గ‌ర్వం క‌నిపించ‌డం లేదు. పైగా ఆ గెలుపు అందిరిదీ అంటూ స‌మావేశం పెట్టి మ‌రీ ప్ర‌శంసిస్తున్నారు. పొలిటిక‌ల్ వ‌ర్గాల‌నే కాదు.. అధికార వ‌ర్గాల‌ను కూడా ఉత్సాహ‌ప‌రుస్తున్నారు. ప్రభుత్వ పనితీరు పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో తాజాగా నిర్వ‌హించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయ‌న పేర్కొన్నారు. , జిల్లాల యంత్రాంగం, సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు.. ఇలా అందరి పని తీరు కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని ప్ర‌శంసించారు.

నాడు– నేడు నుంచి మహిళా సాధికారత, రైతు సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలన్నీ చక్కటి ఫలితాలనిస్తున్నాయని చెప్పారు. అన్ని పథకాలను, ప్రభుత్వ కార్యక్రమాలను అంకిత భావంతో అమలు చేస్తున్నారని, తద్వారా ఏపీ చరిత్రలోనే కాదు, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ ఇలాంటి ఫలితాలను చూసి ఉండరని అన్నారు.

Also Read : అలా చేస్తే ఇరకాటంలో ప‌డేది టీడీపీనే..!

అంద‌రికీ అభినంద‌న‌లు

జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డం, వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ జ‌రిగిన ప్ర‌తీ ఎన్నిక‌లోనూ మంచి ఫ‌లితాలు సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 86 శాతం సీట్లు, పార్లమెంటు స్థానాల్లో 88 శాతం సీట్లు సాధించారు. ట్రెండ్‌ సర్పంచి ఎన్నికల్లోనూ కొనసాగింది. వైసీపీ మద్దతుదారులు 81 శాతం చోట్ల గెలుపొందారు. తర్వాత మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఇదే కొనసాగింది.

75 మునిసిపాల్టీల్లో 74 చోట్ల అంటే 98 శాతం గెలుపొందాం కార్పొరేషన్లలో 12కు 12 చోట్ల అంటే 100 శాతం గెలిచాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో కూడా ఇదే ట్రెండ్‌ కొనసాగింది. 100 శాతం జెడ్పీలు గెలిచాం. దేవుడి దయ వల్ల మంచి పనితీరు చూపుతున్నాం. ప్రతి పథకాన్ని ప్రజల ముంగిటకు చేరుస్తున్నాం. వివక్ష, అవినీతి లేకుండా అత్యంత పారదర్శక పద్ధతిలో వారికి ప్రయోజనాలు అందిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగేలా చూడాలి. అని జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు.

ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను అంకిత భావంతో అమలు చేస్తున్న అంద‌రికీ అభినందనలు తెలిపారు. మీ పనితీరు ద్వారానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కొనియాడారు. మీరు అక్కడ మంచిగా పని చేస్తే, అది ప్రజల గుండెల్లో ప్రభుత్వ పనితీరు కింద ప్రతిబింబిస్తుంది. తద్వారా మంచి ఫలితాలు వస్తాయి. అంతిమంగా దేవుడి దయవల్ల 2024లో కూడా ఇవే ఫలితాలు కొనసాగడమే కాదు.. భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. అని ధీమా వ్య‌క్తం చేశారు.

Also Read : వైఎస్సార్ బాటలో జగన్ గ్రామాల సందర్శన ..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp