పార్టీపై సీఎం జగన్‌ దృషి.. ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు..

By Kotireddy Palukuri Jul. 01, 2020, 09:46 pm IST
పార్టీపై సీఎం జగన్‌ దృషి.. ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు..

వినూత్న నిర్ణయాలు, ప్రజా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో పరిపాలనను ఉరకలెత్తిస్తోన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీపై కూడా దృష్టి సారించారు. పార్టీని మరింత బలోపేతం చేయడం, అంతర్గత విషయాలు, నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయ బాధ్యతలను పార్టీలోని ముగ్గురు కీలక నేతలకు వైఎస్‌ జగన్‌ అప్పగించారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పార్టీ బాధ్యతలు రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డికి అప్పగించారు. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరుతోపాటు చిత్తూరు జిల్లాల బాధ్యతలను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల పార్టీ బాధ్యలను తన సలహదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు.

సజ్జల రామకృష్ణా రెడ్డికి ఆ జిల్లాల బాధ్యలతోపాటు పార్టీ కేంద్ర కార్యాలయ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అదనంగా అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp