రేపు విజయవాడలో సీఎం విందు

By Kotireddy Palukuri Dec. 16, 2019, 08:37 am IST
రేపు విజయవాడలో సీఎం విందు
అసెంబ్లీ సమావేశాలు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 17వ తేదీన విందు ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లను ఈ విందుకు ఆహ్వానించనున్నారు. విజయవాడలోని బరం పార్క్‌లో 17వ తేదీ సాయంత్రం 6.30కి ఈ విందు ప్రారంభమవుతుంది. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన, వివిధ జిల్లాల సమస్యలు, గ్రామ సచివాలయాలు, స్పందన, మహిళల భద్రత తదితర అంశాల మీద విందు భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp