ఏపీలో కలెక్టర్‌కు సోకిన కరోనా

By Kotireddy Palukuri Sep. 18, 2020, 04:15 pm IST
ఏపీలో కలెక్టర్‌కు సోకిన కరోనా

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, దిగువ స్థాయి అధికారులు కరోనా వైరస్‌ బారిన పడగా.. తొలిసారిగా ఓ జిల్లా కలెక్టర్‌కు వైరస్‌ సోకింది. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తాకు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. దీంతో ఆయన తిరుపతి కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఐసోలేషన్‌లోకి వెళ్లారు.

ఇటీవల కలెక్టర్‌ వ్యక్తిగత పనులపై విజయవాడ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత నలతగా ఉండడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఫలితాల్లో వైరస్‌ సోకినట్లు నిర్థారణ అయింది.

కాగా, కలెక్టర్‌కు కరోనా సోకడంతో ఆయన ఆరోగ్యంపై వైసీపీ నేతలు ఆరా తీశారు. పలువరు నేతలు ఫోన్‌లో కలెక్టర్‌ను పరామర్శించారు. ప్రభుత్వ విప్, తుడా చైర్మన్‌ చేవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి తదితరులు కలెక్టర్‌ ఆరోగ్యంపై వాకాబు చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp