మూడు రాజాధానులకు చిరంజీవి మద్దతు

రాజధాని అంశంపై మెగాస్టార్ చిరంజీవి జగన్ ప్రభుత్వానికి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. అధికార,పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ది సాధ్యం.రాష్ట్ర సర్వతో ముఖాభివృధికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉంది. అమరావతిని శాసన నిర్వాహక , విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక, కర్నూల్ ని న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలన్నారు
ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్దికై నిపుణుల కమిటి సిఫార్సులు సామాజిక, ఆర్ధిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయి. గతంలో అభివృద్ధి పాలన అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైంది. ఉమ్మడి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్దిక సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్షకోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్ధితి ఏమిటనే ఆందోళన నాతో పాటు అందరిలోనూ ఉందని చిరంజీవి అన్నారు
సాగు తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలుస కూలీల బిడ్డల భవిష్యత్ కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రతనిస్తుంది. ఇదే సమయంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాందోళనలు అభద్రతాభావాన్ని తొలగించాలి. వాళ్లు నష్టపోకుండా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలని నివృత్తి చేసే ప్రయత్నం ప్రభుత్వం చెయ్యాలని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు.


Click Here and join us to get our latest updates through WhatsApp