జగన్ నిర్ణయం - చిరంజీవి అభినందనలు

By Surya.K.R Dec. 12, 2019, 02:20 pm IST
జగన్ నిర్ణయం - చిరంజీవి అభినందనలు

ఆడవారిపై అకృత్యాలకు పాల్పడుతున్న కీచకులను వెంటనే శిక్షించేలా దిశ చట్టాన్ని జగన్ తీసురావడాన్ని, మెగస్టార్ చిరంజీవి అభినందించారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణదండన విధించటమే సరైన శిక్ష అని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకువచ్చిన ఈ చట్టం లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళల్లో భద్రతా భరోసా నింపుతుందనే నమ్మకం తనకి ఉందని చెపుకొచ్చారు.

దిశ ఘటన అందరిని కలిచివేసిందని, ఆ భావొద్వేగంతోనే అందరు తక్షణ న్యాయన్ని డిమాండ్ చేశారని, నిజానికి తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం ఎంతో మేలని, దీనికోసం ఆంధ్రప్రదేశ్ తొలి అడుగు వేయటం అభినందించదగ్గ విషయమని చెప్పుకొచ్చారు. సి.ఆర్.పి.సి సవరించి నాలుగు నెలల కన్నా, ఎక్కువ పట్టే విచారణ పద్దతిని కేవలం 21 రోజులకు కుదించటం, ప్రత్యేక కోర్టులు మహిళలకోసం పెట్టడం, సొషల్ మీడియాలో మహిళలను వేధించే వాళ్ళకి తీవ్ర శిక్షలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు లాంటి బలమైన చట్టాలు ఉంటేనే నేరాలు చెయాలనే ఆలోచన ఉన్నవాళ్ళకు వెన్నులో వణుకు పుడుతుందని ముఖ్యమంత్రి తీసుకున్న ఈ చర్యతో మహిళాలు భద్రతతో నిర్బయంగా స్వేచ్ఛగా ఉంటారని నమ్ముతున్నట్టు మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp