అగ్ని ప్రమాద మృతులకు 50 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్..

By Kiran.G Aug. 09, 2020, 12:19 pm IST
అగ్ని ప్రమాద మృతులకు 50 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్..

ఈరోజు ఉదయం విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి పట్ల మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ 50 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదం జరగడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు..

విజయవాడలో ఈరోజు ఉదయం స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ స్వర్ణ ప్యాలెస్ ను లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కాగా ఈ ఘటన పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ ముఖ్యమంత్రి జగన్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp