మరోసారి దాతృత్వం చాటుకున్న చెవిరెడ్డి

By iDream Post Mar. 25, 2020, 01:12 pm IST
మరోసారి దాతృత్వం చాటుకున్న చెవిరెడ్డి

సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో తన ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఆదుకోవడంలో అందరికంటే ముందు వరుసలో ఉండే చంద్రగిరి శాసనసభ్యుడు మరోసారి తన సేవా కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించాడు.

తాజాగా కరొనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో నిరోధక చర్యల్లొ భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంగళవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా తన సొంత ఖర్చుతో ప్రతి ఇంటికీ రెండు శానిటైజర్ల చొప్పున మొత్తం 3 లక్షల 40 వేల శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేశాడు.

అలాగే నియోజకవర్గంలోని ప్రతి పంచాయితీ కి పది లీటర్ల శానిటైజర్లు, మెడికల్ కిట్లను ఉచితంగా అందజేశారు. అంతే కాకుండా ఈనెల 31న మరోసారి ప్రతి ఇంటికీ ఉచితంగా మరో శానిటైజర్ బాటిల్ అందించనున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలియజేశారు.

చెవిరెడ్డి తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ప్రజల నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ కష్టకాలంలో చెవిరెడ్డి బాటలోనె మిగతా ప్రజా ప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా కరొనా వైరస్ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp