మండలి రద్దుపై చంద్రబాబు Uturn తీసుకుంటారా ?

By Surya.K.R Jan. 23, 2020, 07:31 pm IST
మండలి రద్దుపై చంద్రబాబు  Uturn తీసుకుంటారా ?

మండలిలో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ కీలక వాఖ్యలు చేశారు. ప్రజల మద్దతుతో గెలిచి చట్టసభలకు వచ్చి ప్రజల మేలు కోసం చట్టాలు చేస్తుంటే రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన మండలిలో సభ్యులు ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఇది ప్రజా స్వామ్యానే అపహాస్యం చేసినట్టు ఉందని మండలి చైర్మెన్ అయితే ఏకంగా విచక్షణ అధికారాలు ఉన్నాయి కాబట్టి తప్పు అని తెలిసినా చేస్తున్నానని చెప్పారంటే ఎంత బహిరంగంగా మండలి వ్యవస్థను దిగచార్చారో అర్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చారు.

ఒకప్పుడు విధ్యావంతులు అసెంబ్లీలో తక్కువ ఉండేవారు కాబట్టి ఈ మండలి వ్యవస్థ అవసరం అని భావించి 169 ఆర్టికల్ ను ఆసరా చేసుకుని పెద్దలు చేసిన సూచన మేరకు 1958 జులై 1 న ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని ఏర్పాటు చేశారు కాని ఇప్పుడు పరిస్థితి మారిందని శాసన సభలోనే అందరు విద్యావంతులే ఉండగా రాజకీయ పునరావాసం గా మారిన మండలి అవసరం ఇప్పుడు ఎంత వరుకు ఉపయోగమో మనం ఆలోచించుకునే సమయం వచ్చిందని కాబట్టి దీనిపై వచ్చే సోమవారం అసెంబ్లీలో సమావేశం అయి చర్చించి ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పుకొచ్చారు.

గతంలో మండలిపై చంద్రబాబు స్టాండ్

1985 లో రామారావు ముఖ్యమంత్రిహోదాలో ఈ మండలిని రద్దు చేశారు. అయితే 2004లో అధికారంలోకి వచ్చిన వై.యస్ రాజశేఖర రెడ్డి తిరిగి ఈ మండలి వ్యవస్థని ప్రారంభించారు. దీనికి వై.యస్ 2004 జులై 8న తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు, ఆనాడు అసెంబ్లీలో వై.యస్ ప్రభుత్వం ప్రవేశ పెట్ట్టిన ఈ తీర్మాణాం పై చంద్రబాబు మాట్లాడుతూ "ఈ మండలి వల్ల అధికారంలో ఉన్న వారికి పదవులు వస్తాయి తప్ప రాష్ట్ర ప్రజలకు లాభం లేదు. దీనివలన కార్యకర్తలకి, నాయకులకి రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కల్పిస్తారు తప్ప దీని వలన బ్రహ్మాండంగా శాసనాలు వస్తాయి, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది అనేది వాస్తవం కాదు.

ఒకప్పుడు చదువు కున్న వారు తక్కువ ఉండేవారు అందుకే ఈ శాసన మండలిలో ఇంటలెక్ట్యువల్స్ ని తీసుకొచ్చి చర్చించాలి అనే ఉద్దేశం ఉండేది , కాని ఇప్పుడు శాసన సభలో ఉన్న అందరు చదువు కున్న వారే. ఇంతకన్న బెటర్ గా శాసన మండలికి వస్తారు అంటే ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు దీనివలన ప్రభుత్వం మీద భారం పడుతుంది తప్ప దేనికి ఉపయోగపడదని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఈ మండలి వ్యవస్థని రద్దు చేస్తాం అని ఆనాడు చెప్పారు. చంద్రబాబు ఒకప్పుడు అన్న మాటలే ఆయన పాలిట శాపంగా మారాయని అర్ధం చేసుకోవచ్చు.

అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మండలి వ్యవస్థని రద్దు చేయకపోగా కుమారుడు లోకేష్ తో పాటు యనమల రామకృష్ణుడు లాంటి వారికి రాజకీయ పునరావాసం కల్పించారు. మంత్రులని చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ నేడు చేసిన ప్రకటనతో కొడుకు పదవితో పాటు అనేక మంది అనునాయుల పదవులకు ఎసరు వచ్చింది. గతంలో మండలిని రద్దు చేస్తా అని ప్రకటించిన బాబు ఇప్పుడు జగన్ కి ఆ విషయంలో మద్దతు ఇచ్చి ఆనాడు తాను అసెంబ్లీలో చేసిన ప్రకటనపై నిలబడి ఉంటారా లేక కొడుకు లోకేష్ పదవి నిలుపుకునేందుకు వ్యతిరేకిస్తారో వేచి చూడాలి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp