Chandrababu Naidu - ఆ మాట‌ల వెనుక ల‌క్ష్య‌మేంటో?

By Kalyan.S Nov. 27, 2021, 07:30 am IST
Chandrababu Naidu - ఆ మాట‌ల వెనుక ల‌క్ష్య‌మేంటో?

ఏపీలో వైసీపీ మరింత బ‌ల‌ప‌డుతోంద‌ని తాజా స‌మీక‌ర‌ణాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఇది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశానికి ఇబ్బందిక‌రంగా మారుతోంది. అధినేత చంద్ర‌బాబుకు మైండ్ బ్లాంక్ అవుతోంది. చివ‌ర‌కు ప‌రిస్థితి ఎలా వ‌చ్చిందంటే ఏడిచైనా సాధించాల‌నే స్థితికి వ‌చ్చింది. ఇప్పుడు కొత్త త‌ర‌హా రాజ‌కీయాల‌కు తెర తీస్తున్నారు. పార్టీలోని నేత‌ల‌ను వైసీపీపైకి ఉసిగొలిపేలా ప్రోత్స‌హిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ లో ఇక నుండి కొత్త రకం నేతలకే ప్రోత్సాహముంటుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రేణిగుంట దగ్గర వర్షాల బాధితులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఇక నుండి వైసీపీ నేతలను ఢీ అంటే ఢీ అనే వాళ్ళకే టీడీపీలో ప్రోత్సాహముంటుందని చెప్పేశారు. అలాంటి నేతలనే తాను ప్రోత్సహించారట. ఢీ అంటే ఢీ అన్న‌దాంట్లో ఉద్దేశం ఏంటో చంద్ర‌బాబే చెప్పాలి. నేత‌లు, నేత‌లు తిట్టుకోవాలో, కొట్టుకోవాల‌నో ఆయ‌న ఉద్దేశం తెలియ‌డం లేదు. అదలా ఉంచితే.. ఇప్పుడున్న నేత‌లు చేస్తోందేంటి?

ఇదే సమయం లో వైసీపీ నేతల తో ఢీ అంటే ఢీ అనేంత స్థాయి నేతలు అసలు టీడీపీలో ఉన్నారా ? ఉన్నా ఎంతమందున్నారు ? అనే చర్చ కూడా మొదలైంది. నిజానికి ఇపుడు చంద్రబాబు చెప్పడం కాదు కానీ పార్టీ లోని నేతల్లో చాలా మంది అలాంటి వారే ఉన్నారు. ప్రత్యర్ధులను ఢీ అంటే ఢీ అనే వారే ఉన్నారు. అయితే వారిలో చాలామంది వివిధ కారణాలతో సైలెంట్ అయి పోయారు. అనంతపురం లో జేసీ బ్రదర్స్ వ్యవహారం చంద్రబాబు చెప్పినట్లే ఉంటుంది. అధికారం లో ఉన్న సమయం లో వీళ్ళ ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువై పోవటంతోనే జనాలు వీళ్ళందరినీ కాదని వైసీపీ కి పట్టం కట్టారు. ఇక పరిటాల సునీత శ్రీరామ్ కూడా ఇదే కోవలోకి వస్తారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రభాకర్ చౌదరి లాంటి చాలా మంది నేతల పద్దతిదే. కాకపోతే అప్పట్లో అధికార పార్టీలోనే ఆధిపత్య పోరు పెరిగి పోవటంతో మొత్తం పార్టీనే కుప్పకూలిపోయింది. కర్నూలులో భూమా ఫ్యామిలీ ఏవీ సుబ్బారెడ్డి కేఈ కృష్ణమూర్తి కుటుంబం ఏమీ తక్కువ తినలేదు.

కడప లో రామసుబ్బారెడ్డి ఆదినారాయణరెడ్డి శ్రీనివాసులరెడ్డి సతీష్ రెడ్డి బిటెక్ రవి లాంటి నేతలు ప్రత్యర్ధులతో సై అంటే సై అన్నవాళ్ళే. వీళ్ళు కాకుండా అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి ,దేవినేని ఉమ, కేశినేని నాని ,బోండా ఉమ ,బుద్ధా వెంకన్న ,కోడెల కుటుంబం ,కరణం బలరామ్ ,ఆమంచి కృష్ణమోహన్, గొట్టిపాటి రవి ,శిద్ధా రాఘవరావు ,చింతకాయల అయ్యన్నపాత్రుడు ,బండారు సత్యనారాయణ ,కూన రవికుమార్ లాంటి నేతలు చాలామందే ఉన్నారు టీడీపీలో. వీళ్ళంతా అధికారంలో ఉన్నపుడు ఆకాశమే హద్దుగా ప్రత్యర్ధుల పై రెచ్చిపోయిన వారే. ఇలాంటి వారిలో కొందరు తర్వాత వైసీపీలో చేరినా మిగిలిన వారంతా ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. ఇంతమందిని పార్టీలోనే పెట్టుకుని ఇంకా ఢీ అంటే ఢీ అనే నేతలనే ప్రోత్సహిస్తానని చెప్పటమే ఆశ్చర్యం గా ఉంది.

Also Read : TDP, Chandrababu - బాబు తప్పు తెలుసుకున్నాడా? లేక తమ్ముళ్లను ఊరుకోబెట్టే ప్రయత్నమేనా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp