చంద్ర బాబు రివర్స్ వాకింగ్

By Bairisetty Nagaraju Dec. 16, 2019, 10:54 am IST
చంద్ర బాబు రివర్స్ వాకింగ్

రివర్స్ రెండరింగ్ ను తుర్పారాబడుతు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహచర టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి సోమవారం అసెంబ్లీ కి రివర్స్ లో నడుచుకుంటూ వచ్చారు. తొలుత చంద్రబాబు సహచర ఎమ్మెల్యే లతో కలసి అసెంబ్లీ సమీపానికి చేరుకున్నారు. అక్కడ వాహనాలు దిగిన వారు అక్కడి నుండి 500 మీటర్ల దూరం లో ఉన్న అసెంబ్లీ కి రివర్స్ లో (వెనకపైపుకి తిరిగి) లో నడుకుంటు వచ్చి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చంద్ర బాబు మాట్లాడుతూ రివర్స్ రెండరింగ్ ద్వారా ప్రభుత్వం అభివృద్ధిని రివర్స్ లో తీసుకెళ్తుంది అని విమర్శించారు. హ్యాపీ నెస్ట్ తమది కాదని ఆ ప్రాజెక్ట్ లో ప్రజలు డబ్బులు చెల్లించి మరీ ఇల్లు కొనుగోలు చేశారని, వాటిని కూడా రద్దు చేసి రివర్స్ రెండరింగ్ కు వెళ్ళడం చూస్తే ప్రభుత్వం కక్ష సాధింపు దోరణి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అనంతరం ఇదే విషయం పై అసెంబ్లీ చర్చించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp