చెప్పేటోడికి..చేసేటోడు లోకువంట..!

By Jaswanth.T Apr. 21, 2020, 05:28 pm IST
చెప్పేటోడికి..చేసేటోడు లోకువంట..!

ఏదైనా పని చేయాలంటే కష్టం గాని గట్టు మీద కూర్చొని 'ఆ.. అలా చెయ్యి.. అలా కాదు ఇలా చేయ్యెహే.. అని చెప్పడం చాలా తేలికే. ఇటువంటి సందర్భం నుంచి చెప్పేటోడు చేసేటోడు లోకువ అన్న సామెత పుట్టుకొచ్చింది. ప్రతిపక్షాలకు సరిగ్గా ఇది ఇప్పుడు సరిపోతుందండంలో సందేహం లేదు. ఇంతమాట ఎందుకన్నానంటే..

పీఠం ఖాళీ చేసి వెళ్తూ ఖజానా కూడా దండుకు పోయిన ఘనత మన కింద పెట్టుకున్నామాయే. ఓ పక్క కరోనా ముంచుకొచ్చే.. ఇప్పుడున్న ప్రభుత్వం దాని నుంచి జనాన్ని ఎలా బయట పడేయ్యాలని నానా పాట్లు పడుతుందాయే. కానీ మనమేమో ఎంచెక్కా.. హైదరాబాద్లో కూర్చొని ఆన్లైన్ సీఎం వేషమేత్తుతున్నమాయే. ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి, కార్యకర్తల బలం ఉన్న ( ఉందని చెప్పుకుంటున్న) పార్టీని నడుపుతూ.. కరోనా కారణంగా కష్టపడుతున్న రాష్ట్ర ప్రజలకు ఏం సేవ సేతున్నావంటే.. ఆన్లైన్లో అభిప్రాయాలు సేకరించి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి పంపిస్తున్నానని సిగ్గులేకుండా చెప్పడం చూస్తుంటే మరోసారి పై సామెతను గుర్తు తెచ్చుకోవాల్సిందే.

మరి నాదేమి పోయింది.. ఎవరికైనా 5000 ఇవ్వాల్సిందేనని మళ్లీ ఒక డిమాండ్. నీ హయాంలో వచ్చిన ప్రకృతి విపత్తుల సమయంలో నువ్వు ఏమి ఇచ్చావ్ అంటే ఏమి చెబుతారు..? (మరి అప్పుడు రాష్ట్రము క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అంటారేమో) అధికారంలో ఉండగా మీరు గొప్పలకు చేసిన బొక్కలు పూడ్చుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. ఇప్పుడు కూడా ఏదో ఒక కారణంతో జనాల్లో ఉండాలనుకోవడం తప్పితే తలకు మాసిన సలహాలు ఎందుకయ్యా..?!.

తమరి అనుభవంలోంచి చూసినప్పుడు ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని అంటారా.. రండి వచ్చి తమకు చేతనైన సేవ చేయడం చెయ్యండి. ఆఖరికి 3500 జీవితానికి ఆయాగా పనిచేసే అమ్మ కూడా కరోనా విధులలో పోలీస్ కష్టం చూసి తన జీతం నుంచి రెండు కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని వచ్చింది. కనీసం తమ పార్టీ ద్వారా ప్రజలకు ఆ మాత్రమైనా సేవ చేశారా..? ఈ ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు.  

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp