టీడీపీ బెజవాడ తర్వాత విశాఖ తలనొప్పి!

By Mavuri S Mar. 06, 2021, 10:00 pm IST
టీడీపీ బెజవాడ తర్వాత విశాఖ తలనొప్పి!

ఇప్పటికే బెజవాడ తలనొప్పులు టిడిపికు తలనొప్పులు తెచ్చి పెడుతుంటే మరో పక్క వైజాగ్ రాజకీయాలు టిడిపిలో కాక పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు ఊగిసలాట ఆ పార్టీలో అయోమయాన్ని మరింత పెంచుతుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వైజాగ్ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబుతో గంటా ప్రత్యేకంగా సమావేశం అవ్వడం, వారిద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి అన్నది టీడీపీలో మరో చర్చకు దారి తీస్తోంది.

విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పై..

ఇటీవల గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు కాశీవిశ్వనాథ్ వైసీపీలో చేరారు. ఆ సమయంలోనే ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలోనే గంటా శ్రీనివాసరావు సైతం తమ పార్టీలోకి వస్తారని చెప్పడం సంచలనం అయ్యింది. దీనిపై చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం. పార్టీ మారే ఉద్దేశం ఉంటే చెప్పాలని, ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని గంటకు తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఎలాంటి కదలిక లేకుండానే అవతలివైపు నుంచి పార్టీ మార్పు మీద ఎందుకు చర్చ నడుస్తోందంటూ గంటా శ్రీనివాసరావును చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే దీనికి గంటా శ్రీనివాసరావు మౌనం వహించి కేవలం అది సైకలాజికల్ గేమ్ గా అభివర్ణించే ప్రయత్నం చేయగా తనకు అంతా తెలుసు అంటూ చంద్రబాబు గంట మీద కాస్త సీరియస్ అయినట్లు సన్నిహితులు చెబుతున్నారు. తాను పార్టీ మారితే కచ్చితంగా మీకు చెప్పే మారుతానంటూ గంటా శ్రీనివాసరావు స్పష్టం చేసి సమావేశం బయటికి వచ్చినట్లు తెలిసింది.

పార్టీ నేతలతో ఏమైనా ఇబ్బంది ఉందా?

గంటా శ్రీనివాస రావు సమావేశంలో చంద్రబాబు పలు ప్రశ్నలకు ఆయన ముందు ఉంచినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేక పార్టీ నేతలతో ఇబ్బందులు ఉన్నాయా అని వాకబు చేసారని ప్రశ్నించారు. దానికి గంట సైతం స్పష్టంగా ఏమీ చెప్పకుండా అలాంటిదేమీ లేదని నవ్వుతూ చంద్రబాబుకు బదులు ఇవ్వడంతో ఆయన మరి ప్రతిసారి మీ మీద పార్టీ మార్పు ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని అడిగారు. దానికి గంట సమాధానమిస్తూ కొందరు కార్యకర్తలు ఒత్తిడి నిజమే అని, పార్టీ మారాలని వారు కోరుతున్నారని కిందిస్థాయి క్యాడర్ ను నిలబెట్టుకోవడం కష్టంగా మారిందని చెప్పుకు వచ్చినట్లు తెలుస్తోంది.

సొంత పార్టీ నేతలతో ను ఇబ్బంది

ఒకపక్క క్యాడర్ పార్టీ మార్పు మీద తీవ్రమైన ఒత్తిడి చేస్తుంటే మరోపక్క సొంత పార్టీ నేతలు తనమీద లేనిపోని ఆరోపణలు చేయడంతో వారికి సర్ది చెప్పడం చాలా కష్టంగా ఉందని గంటా శ్రీనివాసరావు చంద్రబాబు ముందు తన ఆవేదన వెలిబుచ్చారు. అన్ని మాటలు పడుతూ పార్టీలో ఉండాల్సిన అవసరం ఏమిటని, కార్యకర్తల ప్రశ్నిస్తున్నారని దానికి మీరు కూడా స్పందించడం లేదంటూ చంద్రబాబు తీరు మీద గంటా శ్రీనివాసరావు అసహనం వ్యక్తం చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యంగా చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సన్నిహితులతో నిత్యం తమ అనుచరులు ఘర్షణ పడుతున్న వాతావరణాన్ని చంద్రబాబుకు వివరించారు. ఇవన్నీ మీకు తెలిసినవే.. అయినా మీకున్న సమస్యలతో వాటిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించరు అని దీంతోనే ప్రత్యర్థులు పార్టీ మార్పు మీద పదే పదే ఆరోపణలు చేస్తున్నారంటూ గంట చంద్రబాబుకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. సుమారు 20 నిమిషాలకు పైగా సాగిన భేటి లో చంద్రబాబు చివరిగా జాగ్రత్త అంటూ గంట కు చెబుతూ ప్రచారానికి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు విశాఖ రాజకీయాలు టిడిపి అధినేతకు ఎలా సవాల్ విసురుతాయో అని చర్చ మొదలైంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp