ఎస్సీ, ఎస్టీల ద్రోహి చంద్రబాబు

By Bairisetty Nagaraju Dec. 16, 2019, 03:34 pm IST
ఎస్సీ, ఎస్టీల ద్రోహి చంద్రబాబు

రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ ల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు ఒక్కరే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మూడవ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా 6వ రోజైన సోమవారం ఎస్సీ, ఎస్టీ కమీషన్ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ లో ప్రతిపక్షం వాగ్వాదానికి దిగడం తో సభలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...ఎస్సీ, ఎస్టీ కమీషన్ బిల్లు కు చర్చ జరుగుతుంటే...సిగ్గులేకుండా చంద్రబాబు గొడవలకు దిగడం దారుణమన్నారు. ఓ మంచి కార్యక్రమం తలపెట్టే సమయం లో సహకారం అందించాలి కానీ, ఇలా సభలో గొడవ చేయడం చంద్రబాబు కే దక్కిందన్నారు.

1992లో జాతీయ ఎస్టీ, ఎస్సీ కమీషన్ ఏర్పాటు అయితే...చంద్ర బాబు నాయుడు 2003 వరకు మొద్దు నిద్రలో ఉండి, 2004లో ఎస్సీ, ఎస్టీ కమీషన్ తీసుకువచ్చారని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అన్నారంటే ఎస్సీలపై ఆయనకు గల ప్రేమను అర్థం చేసుకోవచ్చు అని అన్నారు. వారి ఎమ్మెల్యే లు ఎస్సీ, ఎస్టీ లు స్నానం చేయరు, వాసన వస్తుంటారు అని అన్నా ఎలాంటి చర్యలు తీసుకోరని అన్నారు. దేశం లో ఎస్సీ, ఎస్టీల ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కరే అని అన్నారు. సుదీర్ఘ చర్చ అనంతరం ఎస్సీ, ఎస్టీ కమీషన్ బిల్ అసెంబ్లీ సాక్షిగా ఆమోదింప చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp