అంతర్వేదిలో మళ్లీ కులాల కుంపటి రాజేయాలని బాబు యత్నం

By Raju VS Sep. 28, 2020, 11:08 am IST
అంతర్వేదిలో మళ్లీ కులాల కుంపటి రాజేయాలని బాబు యత్నం

ఏపీ రాజకీయాల్లో కులాల సమీకరణలతో తాను వెనుకబడిన విషయాన్ని చంద్రబాబు గ్రహించారు. మత రాజకీయాలకు మూలమయ్యారు. అనేక చోట్ల క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలే వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. చిన్న విషయాలను భూతద్దంలో చూపించే యత్నం చేస్తున్నట్టు రుజువయ్యింది. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో మందు బాబుల తగాదాలో ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోతే దాని మీద రాద్ధాంతం చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీ అభిమానులే అమ్మవారి విగ్రహం ఛిద్రం చేసి వివాదం రాజేసిన సంగతి పోలీసుల విచారణలో తేలింది. చివరకు తిరుమలలో అన్యమత ప్రచారం అంటూ సోషల్ మీడియాలో చేసిన అబద్ధపు ప్రచారానికి కేంద్రం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని రుజువయ్యింది. ఇప్పటికే కొందరు అరెస్టు కూడా అయ్యారు.

అదే పరంపరలో అంతర్వేది ఆలయం ప్రాంగణంలో జరిగిన రథం మంటల్లో చిక్కుకున్న విషయాన్ని వివాదాస్పదం చేయడం ద్వారా చంద్రబాబు పెద్ద ప్రణాళిక వేశారు. కానీ ఏపీ ప్రజలు, చివరకు కోనసీమ వాసులు కూడా మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచారు. కొందరు ఆకతాయిలు రెచ్చిపోయినా సహనం ప్రదర్శించారు. సుదీర్ఘకాలంగా ఉన్న ఐక్యతను కొనసాగించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి అంతర్వేదిలో వివాదం సృష్టించాలని చూసిన వారిని పోలీసులు కట్టడి చేశారు. రాళ్లు రువ్వి రచ్చ చేసిన బ్యాచ్ లో కొందరిని అరెస్ట్ కూడా చేశారు.

అయితే తాజాగా అంతర్వేది ఆలయ రథం నిర్మాణం విషయంలో ప్రభుత్వం చెప్పింది చేస్తోంది. వచ్చే రథోత్సవం నాటికి కొత్త రథం మరిన్ని హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దానికి నిధులు కేటాయించింది. కలపను సమీకరించింది. పూర్తిగా సంప్రదాయాలను అనుసరిస్తూ రథ నిర్మాణం ప్రారంభించింది. వేగంగా పూర్తి చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇది చంద్రబాబుకి రుచిస్తున్నట్టు కనిపించడం లేదు. దాంతో అంతర్వేదిలో మరో వివాదం రాజేసేందుకు యత్నిస్తున్నారు. మతం మంటలు పెట్టే యత్నం ఫలించకపోవడంతో చివరకు ఇప్పుడు మళ్లీ కుల కలహాలకు కారణాలు వెదుకుతున్నారు. అందుకు అనుగుణంగానే అంతర్వేది రథం విషయంలో అగ్నికుల క్షత్రియులను రెచ్చగొట్టేపనికి పూనుకుంటున్నారు. వాస్తవానికి అంతర్వేది సమీపంలో ఉన్న స్థానికులందరికీ తగిన గౌరవం ఇచ్చేలా ప్రభుత్వం వ్యవహరించంది. అంతా భాగస్వాములను చేస్తూ రథ నిర్మాణం ప్రారంభించింది. అంతర్వేది ఆలయం విషయంలో అగ్నికుల క్షత్రియులు(మత్స్యకారులు) ప్రాధాన్యత ఉంటుంది.

చంద్రబాబు హయంలోనే వారికి తగిన గుర్తింపు లేకపోవడమే కాకుండా, వారి చేతుల్లోని భూములను ఇతరులకు మళ్లించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు హఠాత్తుగా అగ్నికుల క్షత్రియుల మీద ప్రేమ ఉన్నట్టుగా చంద్రబాబు వ్యవహరించడం విశేషం. అంతేగాకుండా స్థానిక అగ్నికుల క్షత్రియుల పెద్దలందరి సమక్షంలోనే కొత్త రథానికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభించిన విషయాన్ని చంద్రబాబు విస్మరించడం విడ్డూరం.
దానిని కూడా వక్రీకరించే యత్నానికి చంద్రబాబు పూనుకున్నారు. స్థానికంగా ఉన్న సఖ్యత చెడగొట్టే యత్నంలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. మతాలు, కులాల మధ్య విబేధాలు రాజేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందే యత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జనం చంద్రబాబుని చీదరించుకుంటున్నా మార్పు లేదని తేటతెల్లమవుతోంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp