టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షులను నియమించిన చంద్రబాబు

By Karthik P Sep. 27, 2020, 02:16 pm IST
టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షులను నియమించిన చంద్రబాబు

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాటలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా నడిచారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పార్టీ అధ్యక్షులను 2017లోనే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నియమించగా.. తాజాగా ఇదే విధానాన్ని టీడీపీ అధినేత చంద్రబబు కూడా పాటించారు. ఈ రోజు ఆదివారం పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను, రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్తను చంద్రబాబు నియమించారు. ఈ మేరకు ఇంఛార్జిలు, సమన్వయకర్తల జాబితాను విడుదల చేశారు.

పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు వీరు..

1. శ్రీకాకుళం – కూన రవికుమార్‌
2. విజయనగరం – కిమిడి నాగార్జున
3. అనకాపల్లి – బుద్ధ నాగజగదీశ్వరరావు
4. విశాఖ – శ్రీనివాస్‌
5. అరకు – గుమ్మడి సంధ్యారాణి
6. కాకినాడ – జ్యోతల నవీన్‌
7. రాజమండ్రి – కేఎస్‌ జవహర్‌
8. అమలాపురం – అనంతకుమారి
9. నరసాపురం – తోట సీతారామలక్ష్మి
10. ఏలూరు – గన్ని వీరాంజనేయులు
11. విజయవాడ – నెట్టెం రఘురాం
12. మచిలీపట్నం – కొనకళ్ల నారాయణరావు
13. గుంటూరు – శ్రావణ్‌ కుమార్‌
14. బాపట్ల – ఏలూరి సాంబశివరావు
15. నరసారావుపేట – జీవీ ఆంజనేయులు
16. ఒంగోలు – నూకసాని బాలాజీ
17. నెల్లూరు – అబ్ధుల్‌ అజీజ్‌
18. తిరుపతి – నరసింహ యాదవ్‌
19. చిత్తూరు – పులవర్తి నాని
20. కడప – లింగారెడ్డి
21. రాజంపేట – శ్రీనివాస్‌ రెడ్డి
22. కర్నూలు – సోమిశెట్టి వెంకటేశ్వర్లు
23. నంద్యాల – గౌరు వెంకటరెడ్డి
24. హిందూపురం – బి.కె.పార్థసారధి
25. అనంతపురం – కాలువ శ్రీనివాసులు

రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల సమన్వయకర్తలు వీరే...

శ్రీకాకుళం, విజయనగరం – గణబాబు

విశాఖ, అనకాపల్లి – నిమ్మకాయల చినరాజప్ప

కాకినాడ, అమలాపురం – బండారు సత్యనారాయణ

రాజమహేంద్రవరం, నరసాపురం – గద్దె రామ్మోహన్‌ రావు

ఏలూరు, విజయవాడ – ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌

మచిలీపట్నం, గుంటూరు – కొండపల్లి అప్పలనాయుడు

నరసరావుపేట, బాపట్ల – పితాని సత్యనారాయణ

ఒంగోలు, నెల్లూరు – జనార్థన్‌ రెడ్డి

కర్నూలు, నంధ్యాల – వి.ప్రభాకర్‌ చౌదరి

అనంతపురం, హిందూపురం – బి.టి.నాయుడు

కడప, రాజంపేట – సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

తిరుపతి, చిత్తూరు – ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి

అరకు – నక్కా ఆనంద్‌బాబు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp