కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

By Kiran.G Oct. 29, 2020, 07:27 am IST
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులే కాకుండా పలువురు సెలెబ్రిటీలు, కేంద్ర మంత్రులు,ముఖ్యమంత్రులు,మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్‌షా, పహ్లాద్‌జోషి, నితిన్‌ గడ్కరీ, ధర్మేంద్ర ప్రదాన్‌, అర్జున్‌రామ్‌, యశోనాయక్‌ శ్రీపాదతో పాటు మరికొందరు మంత్రులు, పదుల సంఖ్యలో ఎంపీలు మహమ్మారి బారినపడ్డారు. తాజాగా మరో కేంద్ర మంత్రి కరోనా బారిన పడ్డారు. కేంద్ర జౌళి, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కరోనా వైరస్ సోకింది.

తనకు కరోనా సోకిన విషయాన్ని స్మృతి ఇరానీ స్వయంగా ట్విటర్‌లో ప్రకటించారు. కరోనా నిర్దారణ పరీక్ష చేయించుకోగా తనకు కోవిడ్ 19 సోకినట్లు నిర్దారణ అయిందని ఆమె వెల్లడించారు. "ఈ విషయాన్ని చెప్పడానికి నాకు మాటలు రాని అరుదైన సందర్భం ఇది అని తనను కలిసిన వారంతా వీలైనంత త్వరగా పరీక్ష చేయించుకోవాలని ఆమె కోరారు. కాగా ఆమె కరోనా బారినుండి త్వరగా కోలుకోవాలని శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp