ఏలూరు కేంద్ర బృందం... అంతుచిక్కని వ్యాధి మిస్టరీ వీడేనా..?

By Jaswanth.T Dec. 08, 2020, 12:00 pm IST
ఏలూరు కేంద్ర బృందం... అంతుచిక్కని వ్యాధి మిస్టరీ వీడేనా..?
ఉన్న పళంగా ఫిట్స్‌ కొందరికి.. నీరసంగా మారిపోయేవారు ఇంకొందరు.. స్పృహతప్పి పడిపోతున్నది ఇంకొందరు.. అప్పటి వరకు నార్మల్‌గానే ఉన్న వీరంతా ఉన్నట్టుండి అసౌకర్యానికి గురై కుప్పకూలిపోవడంతో ఏలూరు పట్టణంలో కలకలం రేగింది. శనివారం ప్రారంభమైన ఈ లక్షణాలు సోమవారం నాటికి ఎక్కువ మందిలో కన్పిస్తుండడంతో వారంతా ఆసుపత్రులకు క్యూ కట్టారు.

అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే వైద్య సహాయం కల్పించడంతో పాటు, గుర్తు తెలియని అస్వస్తత గుట్టు కనిపెట్టేందుకు కేంద్ర వైద్య నిపుణులతో కలిసి పరిశోధన ప్రారంభించింది. అయితే ఈ లోపే ఆసుపత్రులకు వచ్చి వ్యాధి లక్షణాఆలు తగ్గాక, ఇంటికెళ్ళిన కొందరిలో మళ్ళీ అవే లక్షణాలు కన్పించి ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి.

అయితే ఈ వ్యాధి వైరల్, బ్యాక్టీరియల్‌ సంబంధితం కాదని, అంటు వ్యాధి అసలే కాదని వైద్యశాఖకమిషనర్‌ భాస్కర్‌ ఇప్పటికే స్పష్టం చేసారు. అయితే ఇది ఎలా వస్తుంది? ఎందుకొస్తుంది? అన్నదానిపైనే ప్రధానంగా సందిగ్ధత నెలకొంది. ప్రాణాలకు ప్రమాదం లేదని, లక్షణాలకు చికిత్స చేస్తే రోగులు కోలుకుంటున్నారని వైద్యులు ఇప్పటికే ప్రకటించారు. ప్రజలెవ్వరూ అందోళన చెందవద్దని విజ్ఞప్తులు చేస్తున్నారు. రోగులకు కన్పిస్తున్న లక్షణాలు, వారి శారీరక పరిస్థితిని బట్టి ఆహారం లేదా నీటి ద్వారానే ఈ సమస్య వచ్చి ఉండొచ్చని కూడా అంటున్నారు.

మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకుచెందిన ఉన్నత స్థాయి వైద్య బృందాలు ఏలూరు పట్టణంలోని పరిస్థితులపై పరిశీలన ప్రారంభించారు. ప్రధానంగా నీరు, పాలు, ఆహారం కారణంగానే ఇటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడవచ్చన్న భావన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న అన్ని పరీక్షల్లోనూ త్రాగునీరు, పాలకు సంబంధించి నార్మల్‌ రిపోర్టులే వెలువడ్డాయి. బాధితులకు చేసిన స్కానింగ్‌లో కూడా ఎటువంటి తేడాలు లేవు. దీంతో రోగుల రక్తం, వెన్నెముక ప్రాంతం నుంచి సేకరించిన ద్రవాలను సీసీయంబీతో పాటు, ప్రముఖ వైరాలజీ ల్యాబ్‌లకు పంపించి, నివేదిక కోసం వేచి చూస్తున్నారు.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp