టీకాల‌పై కేంద్రం అఫిడ‌విట్‌.. టీడీపీకి షాక్‌..!

By Kalyan.S May. 14, 2021, 10:30 am IST
టీకాల‌పై కేంద్రం అఫిడ‌విట్‌.. టీడీపీకి షాక్‌..!

అంద‌రికీ టీకాలు ఇప్పించ‌డం చేత‌కాదా..? టీకాల కోసం క‌నీసం 1600 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌లేరా..? సొంతంగా రాష్ట్రాల‌కు కావాల్సిన‌న్ని ఆర్డ‌ర్లు ఇవ్వ‌లేరా..? ఇలాంటి ఎన్నో ప్ర‌శ్న‌లు, వ్యాక్సిన్ వేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌లం అయిందంటూ విమ‌ర్శ‌లు, అన్నిరాష్ట్రాలూ ఎన్ని టీకాలు కావాలంటే అన్ని కొంటున్నాయి.. మీరెందు కొన‌లేరు.. ఇలాంటివి ఎన్నెన్నో వ్యాఖ్య‌లు టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు స‌హా ప‌లువురు నేత‌లు త‌ర‌చూ అనేవారు. కానీ, ఇప్పుడు అటువంటి మాట‌ల‌న్నీ బంద్ అయ్యాయి. టీకాల అంశం కేంద్రం ప‌రిధిలోనిది అయినా, టీడీపీ రాష్ట్ర ప్ర‌భుత్వాన్నే విమ‌ర్శించేది. టీకాల విషయంలో తాజాగా సుప్రింకోర్టులో కేంద్రప్రభుత్వం అఫిడివిట్ దాఖలు చేసిన తర్వాత నిజాలు వెలుగులోకి రావ‌డంతో చంద్రబాబునాయుడు అండ్ కో నోట మాట రావ‌డం లేదు.

ఇప్పటివరకు అందరికీ టీకాలను వేయించటంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిలయ్యారంటు రోజు గోల చేస్తున్నారు. టీకాలిప్పించి జనాల ప్రాణాలను కాపాడటంలో జగన్ విపలమయ్యారు కాబట్టి ముఖ్యమంత్రిగా వెంటనే రాజీనామా చేయాలంటు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలు కావాల్సినన్ని టీకాలను కొంటున్నపుడు ఏపికి మాత్రం జగన్ ఎందుకు కొనటం లేదంటు పదే పదే ట్విట్టర్లోను మీడియా సమావేశాల్లోను నిలదీస్తున్నారు. అయితే తాజాగా టీకాల విషయంలో సుప్రింకోర్టులో దాఖలుచేసిన అఫిడవిట్ ప్రకారం టీకాల సరఫరా నియంత్రణ మొత్తం తమచేతిలోనే పెట్టుకున్నట్లు చెప్పింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బ్యాలెన్స్ చేయటానికి వీలుగా టీకాల కొనుగోలు సరఫరా మొత్తాన్ని తమ చేతిలోనే పెట్టుకున్నట్లు చెప్పింది.

రాష్ట్రప్రభుత్వాలు తమ అవసరాల ప్రకారం టీకాల కోసం ఆర్డర్లు పెట్టినా రెండు ఫార్మాకంపెనీలు సరఫరా చేసేందుకు లేదని స్పష్టంగా చెప్పేసింది. మే1వ తేదీన కంపెనీలు ఉత్పత్తిచేసే టీకాల్లో 50 శాతం రాష్ట్రప్రభుత్వాలు+ప్రైవేటు రంగం కొనుగోలు చేయచ్చని చెప్పినా ఉత్సత్తిదారులు మాత్రం సరఫరా చేయటంలేదు. ఏ రాష్ట్రానికి ఎన్ని టీకాలను సరఫరా చేయాలో తామే నిర్ణయిస్తామని అఫిడవిట్లో కేంద్రం స్పష్టంగా తేల్చిచెప్పింది. రాష్ట్రాలు ఆర్డర్లు ఇచ్చినా సప్లై చేసేముందు ఉతత్పత్తి కంపెనీలు తమతో సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పింది. ఇన్నిరోజులు టీకాలను కొనుగోలు చేయటంలో జగన్ నిర్లక్ష్యం చూపుతున్నారని కమీషన్లు రావనే వ్యాక్సిన్లు కొనటంలేదని భారత్ బయోటెక్ ఒక కులానికి చెందిన కంపెనీ కాబట్టే జగన్ ఆర్డర్లు ఇవ్వటం లేదని నోటికొచ్చినట్లు మాట్లాడారు. మరి తాజాగా కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ తర్వాత చంద్రబాబుతో పాటు ఎవ‌రూ టీకాల వ్య‌వ‌హారంపై స్పందించ‌డం లేదు ఎందుకో..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp