పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఆంద్రప్రదేశ్ ఎంపీలకు చోటు..

By Krishna Babu Sep. 29, 2020, 09:50 pm IST
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఆంద్రప్రదేశ్ ఎంపీలకు చోటు..

పరిపాలనలో మరింత జోరు చూపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది, ఈ మేరకు అన్ని పార్టీల ఎంపీలతో కూడిన నూతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేసి సభ్యులని ఎంపిక చేశారు ..

వాణిజ్య శాఖ కమిటీ చైర్మన్‌గా మరోసారి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని నియమించారు. ఇక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో చోటు దక్కించుకున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సభ్యులను పరిశీలిస్తే..

- ఆర్థిక శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు
- పరిశ్రమల శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి
- హెచ్ఆర్డీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా లావు శ్రీకృష్ణదేవరాయలు, గల్లా జయదేవ్
- ఐటీ శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా వైసీపీ ఎంపీ సత్యనారాయణ,
- రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కోటగిరి శ్రీధర్
- కెమికల్ అండ్ ఫర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నందిగం సురేష్
- గ్రామీణ అభివృద్ధిశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా తలారి రంగయ్యను నియమించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp