జ‌రిగేది ఉప ఎన్నిక : రంగంలోకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం

By Kalyan.S Oct. 29, 2020, 08:49 pm IST
జ‌రిగేది ఉప ఎన్నిక : రంగంలోకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం

కేంద్ర బ‌ల‌గాల బూట్ల చ‌ప్పుళ్లు చూస్తే.. అక్క‌డేదో మ‌హా సంగ్రామం అనుకోక త‌ప్ప‌దు. బ‌ల‌గాల ప‌హారా గ‌మనిస్తే.. ఆ ప్రాంతంలో చాలా పెద్ద ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది అనిపించ‌క మాన‌దు. ఏకంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే రంగంలోకి దిగిందంటే.. అతిపెద్ద రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక‌లో.. లేదా హింసాత్మ‌క ప్రాంతంలో జ‌రుగుతున్న ఎన్నిక‌లో అని అంతా భావిస్తారు. కానీ అక్క‌డ జ‌రుగుతోంది ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక‌. అదే దుబ్బాక‌. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గం హాట్ హాట్ గా మారింది. ఎన్నిక‌ల రాజ‌కీయం హీట్ ఎక్కింది. దీంతో కేంద్రం జోక్యం చేసుకుంది. కేంద్ర బ‌ల‌గాల‌ను దింపింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే ప‌ర్య‌వేక్షిస్తోంది. పోలీస్ అబ్జ‌‌ర్వ‌ర్ గా త‌మిళ‌నాడుకు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ ను నియ‌మించింది. పోలింగ్​ అబ్జర్వర్లను నియ‌మించాల్సిన చోట‌. పోలీస్​ అబ్జర్వర్​ను నియమించారు. దీంతో వ‌చ్చే నెల 3న పోలింగ్ జ‌ర‌గ‌బోయే దుబ్బాక ఉప ఎన్నిక‌ దేశ వ్యాప్తంగానే హాట్ టాపిక్ గా మారింది.

క‌లెక్ట‌ర్ పై బ‌దిలీ వేటు

దుబ్బాక రాజ‌కీయాలు, ఉద్రిక్త‌త‌లు, ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో నాలుగు రోజుల కిందటే కలెక్టర్‌పై బదిలీ వేటు ప‌డింది. వెంకట్రామ్​రెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్త‌డంతో ఆయనను తప్పించి భారతీ హోళికేరికి బాధ్యతలు అప్పగించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువులు, ఇతరుల ఇండ్లపై పోలీసుల సోదాలు, ఈ సందర్భంగా తలెత్తిన వివాదాలు, లాఠీచార్జ్​, అరెస్టులు సంచలనం సృష్టించాయి. పోలీసుల తీరుపై బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాలతో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దుబ్బాక బైపోల్​ను సీరియస్​గా తీసుకుంది. తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ సరోజ్‌ కుమార్‌ ఠాకూర్‌ను పోలీస్‌ అబ్జర్వర్‌గా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా పోలింగ్​ అబ్జర్వర్లను నియమిస్తుంటారు. కానీ.. పోలీస్​ అబ్జర్వర్​ను నియమించడం అనేది చాలా అరుదు. మరోవైపు సీఆర్​పీఎఫ్​, పోలీస్​ బలగాలతో దుబ్బాక టౌన్​లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్​ను బదిలీ చేయటంతో పాటు తాజాగా తమిళనాడు ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్​ను రంగంలోకి దింపటంతో దుబ్బాక బై ఎలక్షన్​పై సీఈసీ స్పెషల్​ ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తోంది.

హోరాహోరీ ప్రచారం

దుబ్బాక సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో వచ్చిన బై ఎలక్షన్​లో గెలుపు కోసం టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్వశక్తులు ఒడ్డుతున్నది. రామలింగారెడ్డి భార్య సుజాతను ఆ పార్టీ క్యాండిడేట్​గా నిలిపింది. మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ ప్రకటించడానికి ముందు నుంచే బీజేపీ అభ్యర్థి రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు ప్రచారం చేసుకుంటున్నారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ టికెట్‌‌‌‌‌‌‌‌ ఆశించి భంగపడ్డ చెరుకు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ తరపున బరిలోకి దిగారు. ఆదివారంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీలు బై పోల్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాయి. రోడ్‌‌‌‌‌‌‌‌ షోలు, ప్రచార సభలకే పరిమితం కాకుండా బైక్‌‌‌‌‌‌‌‌ ర్యాలీలు, డోర్‌‌‌‌‌‌‌‌ టు డోర్‌‌‌‌‌‌‌‌ క్యాంపెయినింగ్‌‌‌‌‌‌‌‌తో హోరెత్తిస్తున్నారు. ఆయా సందర్భాల్లోనూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp