నలభైవేల కరోనా కేసులు నమోదు అవుతాయంట...బాబుగారి కాలజ్ఞానం

By Jaswanth.T Apr. 23, 2020, 08:30 pm IST
నలభైవేల కరోనా కేసులు నమోదు అవుతాయంట...బాబుగారి కాలజ్ఞానం

పరిస్థితులను బట్టి అవకాశవాద నాయకత్వం వెలగబెట్టిన వారికి.. ప్రజల మధ్య నుంచి నాయకుడిగా ఎదిగిన వారికి స్పష్టమైన తేడా అందరూ గుర్తించగలిగేలా ఉంటుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సీఎం జగన్ కు.. ప్రతిపక్షములో ఉన్న 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకులకు మధ్య స్పష్టమైన తేడా ఉంది. గుడ్డిగా సమర్ధించే మీడియా, ప్రత్యర్థి పార్టీలలో అనైక్యత తెలుగు ప్రజల నెత్తిన ఎక్కి ఏలేందుకు అవకాశం దక్కింది. దీంతో అబ్దుల్ కలాం ఎలా మిస్సైల్స్ చేయాలో నేర్పించాను.. అని మాట్లాడగలిగారు.

అయితే నియంత్రిత మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా తెరపైకి రావడంతో ఇటువంటి అవకాశవాదుల అసలు రంగు బయటపడింది. దీంతో సహనం కోల్పోయి నోటికొచ్చినట్లు ప్రకటనలు ఇస్తున్నారు. ఇది ఎంతదాకా వెళ్ళిందంటే తన సొంత పార్టీ మనుగడ అంతంత మాత్రమైన రాష్ట్రంలో కరోనా పేరు చెప్పి జనాన్ని భయభ్రాంతులకు గురి చేసే స్థాయికి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 40 వేల కరోనా కేసులు నమోదు అవుతాయి అని చెబుతూ తన 'సత్తా'ను మరోసారి ఏపి ప్రజల ముందు పెట్టేశారాయన.

రెండు కళ్లుగా భావించే రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలకు కనీసం ప్రత్యక్ష సేవలందించడం మానేసి, ఆన్లైన్ సేవలు, ఉత్తరాలు అంటూ కాలక్షేపం చేయడం చూస్తుంటే అసలు ఆయన్ని ఎక్కడైనా చూపించాలా..? అన్న అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. గతంలో మీకు ఎన్ని చేశాను.. ఇప్పుడు నన్ను కాపాడు కోవాల్సిన బాధ్యత మీదే..నన్ను కాపాడుకోండి..అంటూ ప్రజలకు విజ్ఞప్తిలాంటి ఆఫర్లు ఇచ్చారు. అయితే అప్పుడే అప్రమత్తమైన జనాలు ఈ తీరు చూసి అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని రెస్ట్ ఇచ్చారు. ఆయన ప్రజల పరిస్థితి, వారు పడుతున్న ఇబ్బందులు గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఉన్న పరిస్థితి కాస్త ఇంకొంచెం కిందకు దిగజారిపోయినా పోతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp