గవర్నర్ తో చంద్రబాబు ఏకాంత భేటీ

By Suresh Dec. 13, 2019, 07:46 am IST
గవర్నర్ తో చంద్రబాబు ఏకాంత  భేటీ

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తో టిడిపి అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి చంద్రబాబు రాజ్ భవన్ వెళ్లారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరిస్తోందని ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ కార్యక్రమాలు ప్రసారం చేయకుండా పలు ఛానెళ్లపై నిషేధం విధించిందని చెప్పారు. తక్షణం జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరారు.

అనంతరం గవర్నర్ తో చంద్రబాబు ఏకాంతంగా సమావేశమయ్యారు.పది నిమిషాలపాటు వీరిమధ్య అంతరంగిక భేటీ జరిగింది. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ సమీకరణాలు, పలు అంశాలపై వీరిమధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఏకాంత సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp