న‌ట‌న‌లో మామ‌ను మించిపోయిన చంద్ర‌బాబు

By Sodum Ramana Nov. 30, 2019, 07:57 am IST
న‌ట‌న‌లో మామ‌ను మించిపోయిన చంద్ర‌బాబు

అబ్బ‌బ్బ...ఏమా నట‌న‌. ఏమా క‌ళా నైపుణ్యం. న‌ట సార్వ‌భూమ ఎన్టీఆర్‌నే త‌ల‌ద‌న్నే మ‌హాన‌టుడు మ‌ళ్లీ పుట్టాడు. తెలుగు క‌ళామ‌త‌ల్లికి మ‌రో ముద్దుబిడ్డ దొరికాడు. ఇంత‌కాలం ఈ మ‌హాన‌టుడు ఎక్క‌డున్నాడు? ఇంత పెద్ద సినీరంగానికి చిక్క‌కుండా, దొర‌క్కుండా ఎందుకు తిరుగుతున్న‌ట్టు? ఏ పాత్ర‌లోనైనా న‌టించ‌మంటే జీవించే ఆ అద్భుత న‌ట‌నా చ‌క్ర‌వ‌ర్తి క‌ళాప్ర‌ద‌న్శ‌ను చూడ‌లేక‌పోవ‌డం నిజంగా తెలుగు ప్రేక్ష‌కులు చేసుకున్న మ‌హాపాప‌మేమిటో?

అవును ఆ అద్భుత న‌టుడు మ‌రెవ‌రో కాదు...మ‌న చంద్ర‌బాబునాయుడే. మామ ఎన్టీఆర్‌కు మించిన అల్లుడు. బామ్మ‌ర్ది బాల‌కృష్ణ న‌ట‌న‌ను త‌ల‌ద‌న్నే విద్య నేర్చిన‌వాడు. చంద్ర‌బాబు న‌ట‌న ముందు మేన‌ల్లుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌ట‌న బ‌లాదూర్‌. రాజ‌ధాని ప్రాంతంలో ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమ‌రావ‌తి మ‌ట్టికి చంద్ర‌బాబు సాష్టాంగ న‌మ‌స్కారం చేయడాన్ని చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వేమో. కోటి విద్య‌లూ కూటి కోస‌మే అని పేద ప్ర‌జానీకం గురించి పెద్ద‌లు చెప్పారు.

Read Also: తాజా సర్వే - అవినీతి రాష్ట్రాల జాబితాలో కనపడని ఆంధ్రప్రదేశ్

కాని కోటి న‌ట‌న‌లు అధికారం కోస‌మే అని మ‌న చంద్ర‌బాబు న‌ట‌నను చూస్తే ఎవ‌రైనా అనుకునేమాట‌. రాజ‌ధాని న‌గ‌రంలో క‌నీసం ఒక్క‌టంటే ఒక్క‌టైనా శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణాన్ని చేయ‌ని పెద్ద మ‌నిషి...ఇప్పుడు త‌గదున‌మ్మా అంటూ అక్క‌డికి వెళ్లి రాజ‌కీయ డ్రామాకు తెర‌లేపార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.
రాజ‌ధాని ప్రాంతంలో భాగంగా ఆయ‌న మాట్లాడుతూ హైద‌రాబాద్ మాదిరిగా అమ‌రావ‌తిని అభివృద్ధి చేద్దామ‌నుకుంటే వైసీపీ నేత‌లు అడ్డుప‌డ్డార‌ని విమ‌ర్శించాడు. వైసీపీ అడ్డుప‌డ‌డం మాట ప‌క్క‌న పెడితే రాజ‌ధానిని అభివృద్ధి చేయ‌లేద‌నే మాట‌ను బాబు ఒప్పుకున్న‌ట్టే క‌దా? మ‌రి అక్క‌డ ఏముంద‌ని ఆయ‌న చూడ‌డానికి వెళ్లాడో క‌నీసం బాబుకైనా అర్థ‌మ‌వుతోందా!

రాజ‌ధాని ప‌ర్య‌ట‌న రాజ‌కీయం చేయ‌డానికి ప‌నికొస్తుందేమో త‌ప్ప‌, ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఒరిగేదేమీ లేదు. ఐదేళ్ల‌లో క‌నీసం ఎంత మందికి ప్లాట్ల‌ను ఇచ్చారో చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో బాబు ఉన్నాడంటే....ఆయ‌న పాల‌న ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తోంద‌ని ప‌లువురు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తోందని, భావితరాల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నారని విమర్శించ‌డం చూస్తే ఆయ‌న మాటల్లోని డొల్ల‌త‌నం క‌నిపిస్తోంది.

Read Also: చెప్పులతో వచ్చిన తిప్పలు

ఆల్రెడీ నిర్ల‌క్ష్యానికి గురైన అమ‌రావ‌తిని కొత్త ప్ర‌భుత్వానికి నాటి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అప్ప‌గించింద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. చంద్ర‌బాబు దృష్టిలో భావిత‌రాలంటే...ఒక్క లోకేశే క‌దా! భావిత‌రాలపై అంత‌ ప్రేమే ఉంటే జ‌గ‌న్‌లా ఎందుకు ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం ఇవ్వ‌లేదో ఈ సంద‌ర్భంగా స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుపై ఉంది. అలా కాకుండా సాష్టాంగ న‌మ‌స్కారాలు, పొర్లుదండాలు పెట్టినంత మాత్రాన ప్ర‌జ‌లేమీ అమాయ‌కులు కాద‌నే స‌త్యాన్ని చంద్ర‌బాబు గ్ర‌హించాల‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు. మేధావులు హిత‌వు చెబుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp