నవంబర్ 25- ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఏమి జరగబోతుంది ఆ రోజు.?

By Suresh 19-11-2019 02:15 PM
నవంబర్ 25- ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఏమి జరగబోతుంది ఆ రోజు.?

గత 14 సంవత్సరాల క్రితం చంద్రబాబు మీద తన అత్త గారైన నందమూరి లక్ష్మీ పార్వతి గారు పెట్టిన అక్రమాస్తుల కేస్ విచారణకు రాబోతుంది.అదే రోజు లక్ష్మీ పార్వతి సాక్ష్యాన్ని కోర్ట్ వారు రికార్డ్ చేయబోతున్నారు.ఇప్పటి వరకు ఈ కేస్ తో పాటు ఓటుకు నోటు కేస్ కూడా కలిపి మొత్తం 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు ఇక ముందు విచారణ తప్పించుకోవడం కుదరదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.ఆరునెలలు దాటితే స్టే ల మీద ఉన్న కేస్లు అన్ని విచారించాల్సిందే అనే సుప్రీం కోర్ట్ ఉత్తర్యులను కూడా ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.

గత ఎలక్షన్ టైం లో చంద్రబాబు బీజేపీ కి చేసిన నమ్మకద్రోహంపై అమిత్ షా చాలా గుర్రుగాఉన్నాడు అనితిరుపతిలో అమిత్ షా కారు మీద టీడీపీ కార్యకర్తలు రాళ్ళూ రువ్వటం అమిత్ షా మాన్సులో పెట్టుకున్నాడని , ఈ సారి చంద్రబాబు ని వదిలే ఆలోచన లేదని ఢిల్లీ వర్గాలు చాలా పట్టుదలగా ఉన్నట్లు వినికిడి.టీడీపీని వదిలి ఒక పథకం ప్రకారం బీజేపీ లో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముఖ్యుడైన సుజనా చౌదరి ద్వారా చంద్రబాబుకు ఈ న్యూస్ మూడు రోజుల కిందటే చేరిందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.మొదటి నుండి ఢిల్లీ రాజకీయ వర్గాలకు చంద్రబాబు పెద్ద నమ్మకస్థుడు కాకపోవడం కూడా ఇక ఢిల్లీ వైపు నుండి ఏ సహాయం రాకపోవడానికి ఒక కారణం అవుతుంది అనేది ఢిల్లీ రాజకీయాలు తెలిసిన వారందరు చెప్పుకుంటన్న మాట.
ఒక స్టే విచారణ తరవాత ఇక మిగిలిన అన్ని స్టే లు వరుసలో విచారణకు వస్తాయని ,గత 25 సంవత్సరాలుగా దాదాపు 27 కేసుల్లో 19 స్టే లు తెచ్చుకున్న చంద్రబాబుకి ఇక రానున్న కాలం మొత్తం గడ్డు కాలమే అని,కొడుకు చూస్తే రాజకీయంగా అనుభవం కానీ ,పార్టీ మీద పట్టు కానీ సాధించలేదని చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు మీద ఆందోళనతో ఉన్నాడని అంటున్నారు. చంద్రబాబు ఇక నుండి 19స్టే ల మీద ఉన్న కేస్ లు విచారణ ఎదుర్కోవాలి. తన కొడుకు వైపు నుండి నష్టం తప్ప ఏ చిన్న సహాయం ఎదురు చూడకూడదు అనే విషయం చంద్రబాబు కి కూడా తెలుసు కాబట్టి మౌనం గా ఉంటున్నాడు అని ఒక పత్రిక అధిపతి తప్ప ఇక అతన్ని కాపడేవారు లేరు అని టీడీపీ నాయకుల్లో ధింపుడు కళ్ళం ఆశ.

ఇకపోతే అతి ముఖ్యమైన అంశం.
తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని 1366 కోట్లడబ్బు సంపాదించాడు అని జగన్ మీద కేస్ లు పెట్టిన కేంద్రం,
భర్త అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతి సమత్సరం రెండు వెలకోట్లు హెరిటేజ్ ఆదాయం చూపిన చంద్రబాబు భార్య భువనేశ్వరి మొత్తం ఐదు సమత్సరాలకి గాను పదివేల కోట్లు సంపాదించింది అని,అది కూడా క్విడ్ ప్రోకో ద్వారా వచ్చింది అని జగన్ మీద కేస్ పెట్టిన అదే కేంద్రం చంద్రబాబు భార్య, కోడలి మిద కేస్ పెట్టి జైల్ కి పంపిస్తారా? అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల బీజేపీ సోషల్ మీడియా శ్రేణులతో పాటు,వైస్సార్సీపీ శ్రేణులు,ఆయ పార్టీల కార్యకర్తలు చర్చిస్తున్నారు.

ఏది ఏమైనా,యుద్ధరంగంలో తన ఆఖరి ఘడియాల్లో కర్ణుడి రధచక్రాలు భూమిలోకి దిగినట్లై,చంద్రబాబు స్టే లు కూడా ఇన్ని సంవత్సరాల తరువాత బయటకు రావడం అనేది చంద్రబాబు రాజకీయ జీవితానికి పెద్ద ఛాలెంజ్.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News