జివికె గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై సీబీఐ కేసు

By Krishna Babu Jul. 02, 2020, 04:08 pm IST
జివికె గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై సీబీఐ కేసు

జివికె గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ వెంకట కృష్ణారెడ్డి గుణపతి, అతని కుమారుడు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జివి సంజయ్ రెడ్డి పై సిబిఐ కేసు నమోదు చేసింది. ముంబై విమాశ్రయం అభివృద్ధి నిర్వహణ కాంట్రాక్ట్ విషయంలో 705 కోట్ల మేర అవకతవకలు జరిగాయని సీబీఐ తమ నివేదికలో పేర్కొంది.

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జివికె ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌తో ముంబై విమానాశ్రయం అప్‌గ్రేడ్ మరియు నిర్వహణ కోసం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంగా జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 4, 2006 న MIAL తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే 2012 -18 మధ్యలో విమానాశ్రయానికి వచ్చిన ఆదాయంలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి 38% వాటా ఇవ్వాలి. కానీ జివికె గ్రూప్ తొమ్మిది కంపెనీలకు బోగస్ కాంట్రాక్టులు సృష్టించి వచ్చిన లాభాల్లో 310 కోట్ల రూపాయలు దారి మళ్ళించారని, తమ సొంత సంస్థలకు మేలు చేసేలా జీవీకే గ్రూప్ ఇలాంటి చర్యలకు పాల్పడిందని సీబీఐ ఆరోపిస్తుంది.

అంతే కాకుండా జీవీకే కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సంజయ్ రెడ్డి ప్రమోటర్లుగా ఉన్న గ్రూప్ లోని ఇతర కంపెనీలకు ఆర్ధికంగా సహాయపడటం కోసమే MIALకి చెందిన 395 కోట్ల రిజర్వ్ ఫండ్లను దుర్వినియోగం చేశారని సిబిఐ ఆరోపించింది. ఈ వ్యవహారం మొత్తంలో 9 సంస్థలతో పాటు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లోని పలువురు ఉద్యోగులు కూడా ఈ స్కాంలో భాగం పంచుకున్నట్టు సీబీఐ నిర్దారించింది. వీరిపై కూడా త్వరలోనే చర్యలు తీసుకోబోతునట్టు చెప్పుకొచ్చింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp