రాజధాని మీద ఏ కమిటీ పనిచేస్తుంది?

By Sridhar Reddy Challa Dec. 17, 2019, 10:08 pm IST
రాజధాని మీద ఏ కమిటీ పనిచేస్తుంది?

అసెంబ్లీ చివరి రోజు ప్రభుత్వం నుండి రాజధానిపై స్పష్టత వస్తుంది అనుకుంటున్న తరుణంలో అసెంబ్లీ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి సౌత్ ఆఫ్రికా మోడల్ లో 3 రాజధానులు రావొచ్చు అంటూ చేసిన తాజా ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తుంది.

ఈ సంధర్భంగా ఆయన రాజధాని అంశం పై మాట్లాడుతూ లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి లో రావొచ్చని, ఎక్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం లో రావొచ్చని హైకోర్ట్ కర్నూల్ లో వస్తుందని చెబుతూ దీని మీద ఇప్పటికే ఒక నిపుణుల కమిటీ వెశామని ఆ కమిటి తుది నివేదిక వారంలో వస్తుందని అసెంబ్లీ లో ప్రకటించాడు .

Also Read : తెలుగుదేశం బినామీలకు జగన్ స్ట్రోక్ !

గత సెప్టెంబర్ 13న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్బన్ ప్లానింగ్, సామగ్రాభివృద్ది మరియు అమరావతి అంశాల మీద రిటైర్డ్ ఐ.ఎ.యస్ అధికారి జి. నాగేశ్వర రావు నేతృత్వంలో 5 గురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ కమిటి కి కన్వీనర్ గా జి.నాగేశ్వర రావు గారు వ్యవరిస్థారు. ఇక మిగతా సభ్యుల వివారాలు చూస్తే

ప్రొఫెసర్ మహావీర్(న్యూ డిల్లీ కి చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చరింగ్ ),
అంజలి మొహాన్ (అర్బన్ అండ్ రిజినల్ ప్లానర్),
శివానంద స్వామి ( CEPT, అహ్మదాబాద్)
కె.టి రవీంద్రన్ (రిటైర్డ్ ప్రొఫెసర్, డిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్)
కె.వి అరుణా చలం ( రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానర్, చెన్నై)

ఈ నిపుణుల కమిటి ముఖ్యంగా అమరావతి అభివృద్దికి గల సాధ్యా సాధ్యాలు, నిధుల లభ్యత, నిర్మాణానికి గాను వాస్తవంగా ఎంత ఖర్చు అవుతుంది, దాని లాభ నష్టాలేంటి, ఆర్కిటెక్చరింగ్ మరియు ప్లానింగ్ లాంటి సంకేతిక అంశాల గురించి ప్రభుత్వానికి 6 వారాల్లోగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనుంది.

Also Read : ఎన్ని రాష్ట్రాలలో ఒకటి కన్నా ఎక్కువ రాజధానులు ఉన్నాయి?

ఇది ఇలా ఉండగా ఈ రొజు అసెంబ్లీలో అమరావతి పై నిపుణుల కమిటి నివేదిక మరొక వారంలో వస్తుందని కీలక ప్రక్కటన చెయ్యడంతో ఈ కమిటీ కి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడూ రాష్ట్రంలో అందరూ ఈ నిపుణుల కమిటి ఇచ్చే తుది నివేదిక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp