రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే రాజధానిగా "డామన్"

By Sridhar Reddy Challa Jan. 23, 2020, 05:18 pm IST
రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకే రాజధానిగా "డామన్"

కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డయ్యు డామన్ కి కలిపి "డామన్" ని ఉమ్మడి పరిపాలనా రాజధాని గా ఏర్పాటు చేస్తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల 26 నుండి అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. గత నెల డిసెంబర్ 3 న పార్లమెంటు దాద్రా నగర్ హవేలీ మరియు డయ్యు డామన్ (కేంద్రపాలిత ప్రాంతాల విలీనం) బిల్లు, 2019 ను ఆమోదించింది. రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రా, నగర్ హవేలి మరియు డయ్యు, డామన్ లను విలీనం చేసింది.

ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో పన్నుల విధానాలని సరళికరణ చెయ్యడం, పన్ను ఎగవేతలని అరికట్టడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పౌరులకు మెరుగైన సేవలను అందించదానికి ఈ నిర్ణయం తోర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా జిఎస్టి, వ్యాట్ మరియు రాష్ట్ర ఎక్సయిజ్ సంబంధించిన చట్టాలలో ఏకరూపతను తీసుకురావడానికి, జీఎస్టీ పన్ను, వ్యాట్, మరియు రాష్ట్ర ఎక్సైజ్ వసూలు, బకాయిల రికవరీలో కూడా మంచి ఫలితాలు వస్తాయని కేంద్రం భావిస్తుంది.

అరేబియా సముద్ర తీరాన గుజారాత్ రాష్ట్రంలో పరిధిలో రెండు జిల్లాలు గా ఉన్న డయ్యు, డామన్ లు 1961లో భారత ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేవరకు క్రీశ 1500 నుండి దాదాపు 500 సంవత్సరాల పాటు పోర్చుగీసు పాలనలో ఉన్నాయి. గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉన్న దాద్రా, నగర్ హవేలీ పోర్చుగీస్ పరిపాలన నుండి స్వతంత్రం పొంది 1954లో భారతదేశంలో కలిసింది.1961 నుండి దాద్రా మరియు నగర్ హవేలీ లను కేంధ్ర పాలిట ప్రాంతాలుగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా 1962 నుండి గోవా, 1987 నుండి డయ్యు, డామన్ లను కేంద్ర పాలిట ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అయితే కేంద్రపాలిత ప్రాంతంగా వున్నా గోవా తరువాతి కాలంలో ప్రత్యేక రాష్ట్రంగా మారింది.

ప్రస్తుతం ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి డామన్ ని ఉమ్మడి రాజధాని గా ఏర్పాటు చేస్తూ రెండు ప్రాంతాలను ఒకే లెఫ్ట్ నెంట్ గవర్నర్ పరిపాలన కిందకు తీసుకువచ్చారు. ఇప్పటి వరకు దాద్రా, నగర్ హవేలీ ప్రాంతాలకు సిల్వస్సా పట్టణం రాజధానిగా ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp