ఫోన్ క‌థ ముగిసింది

By G.R Maharshi Dec. 05, 2019, 10:28 am IST
ఫోన్ క‌థ ముగిసింది

బీఎస్ఎన్ఎల్ క‌థ ముగిసిన‌ట్టే. 92,700 మంది ఉద్యోగులు VRSకి సిద్ధ‌ప‌డ్డారు. ఒక‌ప్పుడు ఈ సంస్థ‌లో ఉద్యోగ‌మంటే భ‌ద్ర‌త‌, హోదా, అహం కూడా. చాలా ప్ర‌భుత్వరంగ సంస్థ‌ల్లాగే దీనికి కూడా చ‌ర‌మ‌గీతం పాడుతున్నారు.

ఒక‌ప్పుడు సినిమాల్లో త‌ప్ప మామూలు మ‌నుషులు ఫోన్ చూసేవాళ్లే కాదు. ఉత్త‌రాలు, టెలిగ్రామ్‌లు త‌ప్ప ఇంకోదారి లేని కాలం ఉండేది. రాజీవ్‌గాంధీ హ‌యాంలో టెలికం విప్ల‌వం వ‌చ్చింది. ట్రంక్‌ కాల్ బుక్ చేసి పెద్ద‌గా అరిచే కాలం పోయి మెల్లిగా మాట్లాడే కాలం వ‌చ్చింది.
దేశంలో ఎస్టీడీ బూతులు విజృంభించాయి. గంట‌ల త‌ర‌బ‌డి ఎదురు చూసి ఫోన్‌లో మాట్లాడేవాళ్లు. అర్ధ‌రాత్రి దాటితే కాల్ చార్జీలు త‌గ్గుతాయ‌ని నిద్ర మేల్కొని ఫోన్లు చేసుకునేవాళ్లు.

ఇళ్ల‌లోకి ఫోన్ రావాలంటే ఎన్నో స‌మ‌స్య‌లు. బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ చుట్టూ తిరిగి, అధికారుల‌ను కాకాప‌ట్టి ,అప్లికేష‌న్ ఫిల‌ప్ చేసి అఫిడ‌విట్ స‌మ‌ర్పించి డ‌బ్బులు క‌డితే ఎప్పుడో వ‌చ్చేది. లైన్‌మెన్‌కి డ‌బ్బులిస్తే తాపీగా వ‌చ్చి బిగించేవాడు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ‌మంటే ఒక‌ప్పుడు బంగారు బాతు.

సెల్‌ఫోన్ వ‌చ్చి ఫోన్‌కి స‌మాధి క‌ట్టింది. కొత్త కంపెనీలు వ‌చ్చాయి. ఎయిర్ ఇండియా, ఎల్ఐసీ లాగా బీఎస్ఎన్ఎల్ వెనుక‌ప‌డింది. పోటీ త‌త్వం పోయింది. ఫ‌లితం ఇప్పుడు అనుభ‌విస్తోంది. మ‌న నాయ‌కులు కూడా ప్రైవేట్ కంపెనీల కోసం ప్ర‌భుత్వ సంస్థ‌ల్ని సునాయాసంగా ఉరి తీస్తారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp