బ్రదర్ అనిల్ కు తప్పిన ప్రమాదం

By Krishna Babu Feb. 15, 2020, 11:47 am IST
బ్రదర్ అనిల్ కు తప్పిన ప్రమాదం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ బావమరిది, షర్మిళ భర్త ప్రముఖ ఇవాంజిలిస్ట్ బ్రదర్ అనిల్ కు పెను ప్రమాదం తప్పింది. అనిల్ కుమార్ ప్రయాణిస్తున్న కారుకు స్వల్ప ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ నుండి విజయవాడకు వెళుతుండగా జగయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు దగ్గర ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఘటనా స్థలానికి చెరుకున్నారు. ఈ ప్రమాదం లో డ్రైవర్ కు, గన్ మ్యాన్ కు స్వల్ప గాయాలు కాగా, బ్రదర్ అనిల్ సురక్షితంగా బయటపడ్డారు. వైద్యులు అనిల్ ను పరీక్షించి ప్రథమ చికిత్స చేసి పంపినట్టు తెలుస్తుంది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp