మీ మంత్రులే కాదు.. మేమూ బీసీలమే...!!

By Nehru.T Feb. 23, 2020, 09:25 am IST
మీ మంత్రులే కాదు.. మేమూ బీసీలమే...!!

బాబూ.. చంద్రబాబు గారు ..మీ కేబినెట్లోని మంత్రులే బీసీలు అంటుకుంటన్నారేటో... మేమూ బీసీలమే .పదేళ్లు మంత్రులుగా ఉన్నాము... మాట్లాడేముందు ఆలోచించండి అని మంత్రి బొత్స సత్తిబాబు ఫైర్ అయ్యారు. టిడిపివాళ్ళమీద తమకేమీ కక్ష గట్రా లేదని,నిజాలు నిగ్గు తేల్చడానికే సిట్ వేస్తున్నామన్నారు. తాము మొదటి నుంచి అమరావతి భూసేకరణలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్నామని, ఒకవేళ అలాంటిది లేకుంటే సిట్ దర్యాప్తు లో తెలుతుందని, దీనికి భుజాలు టాడుముకొనక్కర్లేదన్నారు... ఇంకా సత్తిబాబు ఏమన్నారంటే..

* అమరావతి పేరుతో దోపిడీ జరిగిందని, ఇంసైడ్ ట్రేడింగ్ గురించి చెప్పాము
* దానికి ఎంక్వైరీ చేయండి, తప్పుచేస్తే శిక్షించండి, సిబిఐ కి అప్పగించుకోండి అని ప్రతిపక్షాలు గోల చేసాయి.
* ఇప్పుడు సిట్ కి ఇవ్వడాన్ని వారే తప్పుపడుతున్నారు. ఇదెక్కడి రాజకీయం
* జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతి లో ప్రారంభ దశలో ఉన్న పనులు ఆపడం జరిగింది.
* భూసేకరణలో అవకతవకలు కరిగాయని అప్పుడే చెప్పాము
* ఇంసైడ్ ట్రేడింగ్ జరిగింది అణా విషయం అందరికి స్పష్టం చేసారు
* అవకతవకలపై విచారణ చేయడం కక్ష సాధింపు ఎలా అవుతుంది?
* ప్రభుత్వం స్పష్టంగా చెపుతోంది ఇది రాజకీయ కక్ష సాధింపు కాదు.
* గత ప్రభుత్వం లో జరిగిన తప్పులను ఎత్తి చూపితే తప్పని అనడం సరికాదు.
* గత ప్రభుత్వంలో బిసి మంత్రులపై టార్గెట్ అనడం హాస్యాస్పదం.
* నేను బిసి మంత్రినే.. నేను గతంలో పది సంవత్సరాల్లో మంత్రిగా పనిచేశాను.
* చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నవారే బిసి నేతలా మేము కాదా?
* చంద్రబాబు మాట్లాడేముందు ఆలోచించి మాట్లాడాలి.
* సిట్ విచారణ ఎలాగైనా చేయించే అవకాశం ఉంది.
* గతంలో విశాఖ కుంభకోణంలో కూడా సిట్ వేసినప్పుడు అప్పటికి ముందు జరిగినలవదేవిల మీద కూడా విచారణ చేయమన్నపుడు ఏమైంది?
* తప్పుడు ఆరోపణలు ప్రజలు హర్షించరు
* ఆలోచించి మాట్లాడాలి...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp