బాలీవుడ్ చీలుతోందా..?!

By Voleti Divakar Sep. 17, 2020, 07:04 pm IST
బాలీవుడ్ చీలుతోందా..?!

బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో మొత్తం దేశాన్ని వేడెక్కిస్తోంది. ఈవాడీ వేడి తాజాగా పార్లమెంటును కూడా తాకింది. సుషాంత్ సింగ్ కేసులో రాజకీయ పక్షాలనే కాక బాలీవుడన్ను కూడా నిలువునా చీల్చేస్తోంది. ఈ కేసులో బిజెపి, దాని మిత్రపక్షాలు ఒకవైపు నిలవగా, మిగిలిన అన్ని పార్టీలు ఒకవైపు నిలుస్తున్నాయి. అయితే ఈన్యవహారంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మనుతా బెనర్జీ నోరుమెదపకపోవడమే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈకేసులో అరెస్టు ఆయిన బాలీవుడ్ నటి, సుషాంత్ సింగ్ ప్రియురాలు రియాచక్రవర్తి పశ్చిమబెంగాల్ కు చెందినది కావడం గమనార్హం. ఈకేసును వేడెక్కించిందీ... రాజకీయ రచ్చ చేసిందీ బాలీవుడ్ రెబెల్ హీరోయిన్ కంగనా రనౌత్ ఆనే చెప్పాలి. కంగనారనౌత్ బాలీవుడ్ లో బంధుప్రీతి ఎక్కువని, అందువల్లే సినీ అవకాశాలు లేక సుషాంత్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వ్యాఖ్యానించి అగ్నికి ఆజ్యం పోసింది. ఆతరువాత ముంబయ్ ని పాక్ఆక్రమిత కాశ్మీర్‌గా ఆభివర్ణించి సంచలనం సృష్టించింది. ముంబయ్ పోలీసులు మూవీ చూఫియా కన్నా ప్రమాదకరమని తీవ్ర ఆరోపణలు చేసింది. బాలీవుడ్ హీరోలు డ్రగ్స్ తీసుకోమని ప్రకటించాలని కొంత మంది పేర్లను ప్రకటించి సంచలనం సృష్టించింది. కంగనను ముంబయ్ లో ఆడుగుపెట్టనీయమని శివసేన ప్రకటించగా, బిజెపి ప్రభుత్వం కల్పించిన వై కేటగిరీ భద్రతతో ముంబయ్ లో ఆడుగుపెట్టింది.

ఈలోగానే శివ సేన ప్రభుత్వం కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేయించింది. శివ సేన ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే కుమారుడు ఆదిత్య మూవీ, డ్రగ్స్ చూఫియాకు కొమ్ముకాస్తున్నారని కూడా కంగన ధ్వజమెత్తింది. దీంతో సుషాంత్ సింగ్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా రచ్చగా మారింది. తాజాగా ఈ వ్యవహారం పార్లమెంటులో చర్చకు రాగా బిజెపి ఎంపి రవికిషన్ బాలీవుడ్ మత్తుకు బానిసవుతోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయగా, సమాజ్ వాదీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జయాబచ్చన్, డ్రీమ్ గర్ల్ హేమామాలిని బాలీవుడ్ కు మద్దతుగా మాట్లాడారు. మరికొంతమంది హీరోయిన్లు కూడా కంగనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చారు.

ఏది ఏమైనా రానున్న కాలంలో మరింత మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ అంశం పై స్పందించే ఆవకాశాలు ఉన్నాయి. ఎవరు ఎవరికి మద్దతు ప్రకటిస్తారన్నదే ఇక్కడ ఆసక్తికర అంశం. భిన్నాభిప్రాయాల మధ్య బాలీవుడ్ నిలువునా చీలిపోయే ఆవకాశాలే కనిపిస్తున్నాయి. ఆయితే కేసులతో ఉక్కిరిబిక్కిరవుతూ మానసికంగా వేధింపులకు గురవుతున్న రియాచక్రవర్తి రాజకీయ పార్టీలకు లక్ష్యంగా మారడం విషాదం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp