బొబ్బిలి కోటలో పాగా వేసేది ఎవరు?

By Nehru.T Mar. 07, 2021, 02:30 pm IST
బొబ్బిలి కోటలో పాగా వేసేది ఎవరు?

ఉత్తరాంధ్రలో ఇతర మున్సిపాల్టీల్లో ఎన్నికల సంగతి ఎలాగున్నాగానీ బొబ్బిలి మాత్రం ప్రతిష్టాత్మకంగా మారనున్నది. మిగతా అన్ని చోట్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశానికి మధ్య పోరు సాగుతుండగా చరిత్రాత్మక బొబ్బిలి మున్సిపాలిటీలో మాత్రం అధికార వైఎస్సార్సీపీకి, బొబ్బిలి సంస్థానం వారసుడు బేబీ నాయనకు మధ్య పోటీ ఉంటుంది.

వాస్తవానికి మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో సైతం బేబీనాయనకు, వైఎస్సార్సీపీకి మధ్య పోటీ జరగగా నియోజకవ ర్గం నాలుగు మండలాలు(బాడంగి, తెర్లాం, రామభద్రపురం, బొబ్బిలి)లో మొత్తం 110 పంచాయతీలకుగాను చోట్ల తాను బలపర్చిన 45 మందిఅభ్యర్థులను గెలుపుతీరాలకు చేర్చి తన సత్తా ఏమిటో ఆయన చాటారు.

Also Read:బెంగాల్‌లో దుబ్బాక తరహా ప్రయోగం చేస్తున్న బీజేపీ!

రాష్ట్రవ్యాప్తంగా వీరులు, సూరులు, చాణక్యులు, తురుంఖాన్లు అనుకున్న టీడీపీ పెద్ద నాయకులు, మాజీ మంత్రులు, ఎంపీలకు సైతం సాధ్యం కానిది బేబీనాయన సాధ్యం చేసి చూపించారు. చివరకు చంద్రబాబు సారథ్యం వహించిన కుప్పం, జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల కుటుంబం, ఎంపీ రామ్మోహన్ వంటివారు కూడా వైఎస్సార్ సేపీకి ఎదురు నిలవలేక పంచాయతీల్లో దాదాపు 85 శాతం వరకూ అప్పగించేశారు. కానీ బొబ్బిలిలో మాత్రం బేబీనాయన సాంత బలంతో వైఎస్సార్ సేపీ అభ్యర్థులకు ఎదురునిలిచి గౌరవప్రదమైన ఫలితాలు సాధించారు. అయితే ఇదే జోరు మున్సిపాల్టీలోనూ ఉంటుందా అన్నది చూడాలి

గతంలో ఏం జరిగిందంటే!!

2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 30 వార్డులకుగాను వైఎస్సార్సీపీ నుంచి 15 మంది, టీడీపీ మంచి 13 మంది, ఇంకో ఇద్దరు ఇండిపెండెంట్లుగా గెలుపొందారు. అప్పటికి బేబీనాయన అన్నయ్య అప్పటి ఎమ్మెల్యే సుజయ్ "కృష్ణ రంగారావు వైఎప్పార్సీపీలోనే ఉన్నారు. మెజార్టీ కౌన్సిల్ స్థానాలు వైఎస్సార్సీపీ గెలుపొందినప్పటికీ సుజయ్ వారిని కాపాడుకోలేకపోయారు. వారిలో ఇద్దరు టీటీపీవైపు మల్లిపోగా, ఇండిపెండెంట్లు సైతం అటే మొగ్గుచూపడంతో తెలుగుదేశం అభ్యర్థి అచ్యుతవల్లి మున్సిపల్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు.

ఆ తరువాత రెండేళ్లకు సుజయ్ తెలుగు దేశంలోకి మారి గనుల శాఖామంత్రిగా పని చేశారు. ఆ తరువాత 2019లో జరిగిన ఆసెంబ్లీ ఎన్నికల్లో సుజయ్ తెలు గుదేశం తరఫున పోటీ చేసి శభంగి చినప్పలనాయుడి చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత ఆయన రాజ కీయాలకు కాస్త దూరంగా ఉంటుందడంతో ఆయన సోదరుడు బేబీనాయనకు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు దక్కాయి.

అయితే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దూకుడును ఎలా ఎదుర్కొంటారన్నది చూడాలి. వాస్తవానికి బేబీనాయన కుర్రాడిగా ఉన్నపుడే, అంటే పాతికేళ్లలోపే బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గా (2005-2009) పని చేశారు. అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావించినా, వయసు తక్కువ కావడంతో ఆయన అన్నయ్య అయిన సుజయ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా ఆయన గెలుపొందారు.

Also Read:మున్సిపల్ ఫలితాల తర్వాత మారబోతున్న రాజకీయ సమీకరణాలు

ఇక పట్టణంలో బేబీనాయన ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని మద్దతుదారులు ఆశిస్తుండగా ఎలాగైనా బొబ్బిలి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలని అధికారపార్టీ శతథా యత్నిస్తోంది. వార్డు వార్డుమా జల్లెడపట్టడమే కాకుండా మంత్రి బొత్స సత్తిబాబు కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా క్యాడర్ను సమాయత్తం చేస్తూనే ఓటర్లను తమవైపు లాక్కునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ అనుకూల కౌన్సిల్ ఏర్పడితే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సారి పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉన్నందున ప్రతి ఓటూ... ప్రతివారూ కీలకం కానుంది. 

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp