మేము చెప్పిందే.. జగన్‌ ప్రభుత్వం చేస్తోంది : బీజేపీ ఎంపీ జీవీఎల్‌

By Kotireddy Palukuri Jan. 21, 2020, 08:36 pm IST
మేము చెప్పిందే.. జగన్‌ ప్రభుత్వం చేస్తోంది : బీజేపీ ఎంపీ జీవీఎల్‌
బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టినవే సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరశింహారావు అన్నారు. హైకోర్టును రాయలసీమలో పెట్టాలని తాము డిమాండ్‌ చేసిన మేరకే వైఎస్సార్‌సీపీ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. ఆ క్రెడిట్‌ తమ పార్టీకే ఎక్కువ రావాలన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వివరాలు ఆయన మాటల్లోనే...


‘‘రాజధాని రాష్ట్రం పరిధిలోని అంశం. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఏర్పాటు పై కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ విజయవాడ, గుంటూరుల్లో రాజధాని వద్దని చెప్పినా కూడా టీడీపీ అక్కడే ఏర్పాటు చేసింది. అప్పుడు కేంద్రం ఏమీ చేయలేదు. రాజధానిపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కొంత మంది టీడీపీ నేతలు అడుగుతున్నారు. పెద్దన్న ప్రాత పోషించడానికి ఇదేమీ కుటుంబ సమస్య కాదు. అప్పుడు తమకు ఇష్టానుసారం వ్యవహరించిన టీడీపీ ఇప్పుడు కేంద్రం పెద్దన్న పాత్ర పొషించాలని కేంద్రం పైకి నెట్టడం సరికాదు. ఇలా అయితే టీడీపీ దద్దమ్మ పాత్ర పొషిస్తుందా..?

Read Also: అమరావతి - మాణిక్య వరప్రసాద్ రాజీనామా

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఇన్ని ఆధారాలున్నా కూడా ఎందుకు కేసులు నమోదు చేయడంలేదు. టీడీపీ పార్టీలో ఉన్నఅక్రమార్కులను కాపాడేందుకు వైఎస్సార్‌సీపీ పని చేస్తుందా..? పైకి దూషించుకుంటూ లోపల మాత్రం భూ వ్యవహారాలపై మాత్రం ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. అమరావతిలో జరిగిన నష్టానికి రెండుపార్టీలు బాధ్యత వహించాలి.

జనసేనతో కలసి కో ఆర్డినేటì ంగ్‌ కమిటీ తో చర్చించి...ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడతాం. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. పసిబిడ్డలా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, అక్రమాలతో అధికార, ప్రతిపక్ష పార్టీలు దగా చేస్తున్నాయి. రాష్ట్రం అభివృద్ది జనసేన, బీజేపీ కూటమి వల్లే సాధ్యం.’’ అని జీవీఎల్‌ నరశింహారావు పేర్కొన్నారు.

Read Also: సైబరాబాద్ నుండి - అమరావతి వరకు

కాగా, జీవీఎల్‌ తాజా ప్రకటనతో.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులకు బీజేపీ మద్దతు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాయలసీమలో హైకోర్టు అనేది బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిన అంశం. న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించి, న్యాయ వ్యవహారాలన్నింటినీ  
అక్కడ నుంచే నిర్వహించాలని అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంతో బీజేపీ మేనిఫెస్టో అమలు జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి బీజేపీ మద్దతు ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp