2గంటల మంత్రి

అప్పట్లో వచ్చిన ఒక సినిమాలో ఒకరోజు ముఖ్యమంత్రిని చూసాం. వాస్తవంలో దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి 13రోజులు, 13నెలల పాటు ప్రధానిగా సేవలందించారు. ఇది ఇలా ఉంటే ఒక నేత కేవలం 2గంటలు మాత్రమే మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు. ఇది బీహార్ లో జరిగింది. బీహార్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ గా పనిచేసి జనతాదళ్-యు పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన మేవాలాల్ చౌదరీ ఇటీవల కొలువుదీరిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు . ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజున ఆయనకు విద్యాశాఖను కేటాయించారు. మేవాలాల్ మరో రెండు రోజుల తరువాత అధికార బాధ్యతలు స్వీకరించారు. అయితే అప్పటికే ఆయన వైస్ చాన్సలర్ గా చేసిన అవినీతి పై వైరిపక్షాలు ధ్వజమెత్తడం ప్రారంభించారు. ప్రతిపక్షాల ఒత్తిడి, తమ ప్రభుత్వం అప్రతిష్టపాలవుతోందన్న విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి నితీష్ ఆయనతో రాజీనామా చేయించారు.
మేవాలాల్ మొత్తం మీద రెండు గంటలు మాత్రమే విద్యాశాఖ మంత్రిగా పనిచేసినట్టయ్యింది. మేవాలాల్ చౌదరి వైస్ చాన్సలర్ గా పనిచేసినపుడు 2017లో బోధన, సాంకేతిక సిబ్బంది నియామకాల్లో అక్రమాలు జరిగాయి. ఈమేరకు ఆయన పై కేసు కూడా నమోదై జైలుకెళ్లారు. ఆతరువాత బెయిల్ పై విడుదలయ్యారు. ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రి అయ్యారు. మేవాలాల్ కారణంగా నిజాయితీపరుడున్న నితీష్ కుమార్ ప్రభుత్వం అప్రతిష్టపాలు కావడంతో ఎట్టకేలకు మేవాలాల్ పై వేటు వేయాల్సి వచ్చింది.


Click Here and join us to get our latest updates through WhatsApp